తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. కామెడీ హీరోగా ఆయనందుకున్న స్థాయికి మరెవరికీ సాధ్యం కానిది. కామెడీలో స్టార్ ఇమేజ్ సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. అలాగని ఆయన వేరే జానర్లలో సినిమాలు చేయలేరని కాదు. ‘ఎర్రమందారం’, ‘ఆ నలుగురు’ లాంటి సినిమాల్లో కరుణ రసాన్ని ఎంత గొప్పగా పండించారో అందరూ చూశారు. మరెన్నో సినిమాలు, విలక్షణమైన పాత్రలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐతే హీరోగా హవా తగ్గాక కొన్నేళ్ల పాటు ఆయన తడబడ్డారు. కెరీర్ డోలాయమానంలో పడింది. కానీ తన వయసుకు తగ్గ క్యారెక్టర్, కామెడీ రోల్స్‌కు మారాక ఆయన దశ తిరిగింది. మళ్లీ బిజీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు ఆయనకు మంచి పాత్రలిచ్చి కెరీర్ జోరందుకోవడానికి కారణమయ్యారు.
ముఖ్యంగా అనిల్ రావిపూడికి రాజేంద్ర ప్రసాద్ అంటే ప్రత్యేకమైన అభిమానం. తొలి సినిమా ‘పటాస్’ను మినహాయిస్తే ప్రతి సినిమాలోనూ ఆయనకు స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తున్నాడు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఎంతగా వినోదం పండించాయో తెలిసిందే. ఇప్పుడు అనిల్ కథతో, అతడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’లో రాజేంద్ర ప్రసాద్ ఇంకా ముఖ్యమైన పాత్రనే పోషించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కూడా ఉన్నప్పటికీ టైటిల్ రోల్ రాజేంద్రుడిదే. ఒక రకంగా ఆయనే ఈ చిత్రానికి హీరో కూడా. కెరీర్లో ఈ దశలో ఆయనకు లీడ్ రోల్ చేసే అవకాశం రావడం విశేషమే. ఇక ఈ పాత్ర గురించి చిత్ర బృందమే కాక.. ఇండస్ట్రీ జనాలు కూడా గొప్పగా చెబుతున్నారు.
నోరు తిరక్క ఫ ఫా ఫి ఫీ అంటూ ఒక విచిత్రమైన భాషలో సైగలు చేసే పాత్ర ఆయనది. నోట మాట రాకున్నా నటనలో వెలిగిపోవాలనుకునే ఈ పాత్ర వల్ల అతడి కొడుక్కి ఎలాంటి ఇబ్బందులొచ్చాయనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే సినిమా అంతా రాజేంద్రుడి హవానే సాగేలా ఉంది. అనిల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానై సినిమా తీయించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే అతడికి ఇది ఒకరకంగా ప్రయోగమే. రాజేంద్రుడి పాత్ర మీదే అతడి ఫోకస్ అంతా ఉన్నట్లుంది. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ వన్ మ్యాన్ షో అని దిల్ రాజు అంటే.. గాలి సంపత్ పాత్రకు ఆయన జాతీయ అవార్డు గెలుచుకుంటారంటూ రామ్ ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. చిత్ర యూనిట్లోని వాళ్లు కూడా రాజేంద్రుడి పెర్ఫామెన్స్ గురించి ఓ రేంజిలో చెబుతున్నారు. ఈ సినిమాతో ఈ లెజెండ్ మళ్లీ నట విశ్వరూపం చూపించబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on March 9, 2021 4:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…