స్టార్ హీరోలు వేదికల మీద మాట్లాడుతుంటే.. వారి దృష్టిని ఆకర్షించడానికి అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం మామూలే. ఉన్నట్లుండి స్టేజ్ మీదికి వచ్చి హీరోల కాళ్ల మీద పడిపోవడం.. వాళ్లను గట్టిగా హత్తుకోవడం లాంటివి చేస్తుంటారు. చాలామంది హీరోలు వీటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తప్పని చెబుతుంటారు. ఇలాంటి ఆరాధన భావాన్ని ఎంజాయ్ చేసే హీరోలు కూడా లేకపోలేదు. ఇలాంటివి పనిగట్టుకుని ప్లాన్ చేసి మరీ చేయించుకునే హీరోలూ లేకపోలేదు.
ఐతే ప్లాన్ చేసినా చేయకున్నా.. పెద్ద పెద్ద స్టార్ల విషయంలో ఇలా జరగడం అయితే మామూలే. కానీ నవీన్ పొలిశెట్టి అనే చిన్న హీరో విషయంలో ఇలా జరిగితే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. తన కొత్త చిత్రం ‘జాతిరత్నాలు’ ప్రమోషన్లో భాగంగా వైజాగ్ ఆర్కే బీచ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌కు నవీన్ పొలిశెట్టి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వేదిక మీద అతను మాట్లాడుతుండగా ఒక అనూహ్య పరిణామం జరిగింది.
ఉన్నట్లుండి కొంత మంది కుర్రాళ్లు వేదిక మీదికి దూసుకొచ్చేశారు. అందులో ఒక చిన్నబ్బాయి నేరుగా నవీన్ కాళ్ల మీద పడిపోయాడు. వదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు. దీంతో అవాక్కయిన నవీన్ అతణ్ని పైకి లేపి హత్తుకున్నాడు. ఇలాంటివి తప్పని, ఎప్పుడు చేయొద్దని వారించాడు. అంతటితో ఆగకుండా.. ‘‘నువ్విలా చేస్తే నేనేదో ప్లాన్ చేసి చేయించానని అనుకుంటారు’’ అనడంతో ఆ ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. ‘‘ఇది నేను చేయించలేదు అని చెప్పు’’ అని ఆ కుర్రాడితో అనడంతో అతను తనకు తానుగా ఇలా చేశానని వెల్లడించాడు.
తన మీద ప్రేమ చూపించాలని, కానీ ఇలా కింద కాకుండా పైన పట్టుకుని ప్రేమించాలని నవీన్ చమత్కరించడంతో ఆ వేడుకలో మరోసారి నవ్వులు విరిశాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలా ప్లాన్ చేసి చేయించుకునే హీరోలకు కౌంటర్ లాగా ఈ వీడియోను చూపిస్తున్నారు. అలాగే నవీన్ సెన్సాఫ్ హ్యూమర్‌ను కొనియాడుతున్నారు.
This post was last modified on March 6, 2021 5:08 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…