Movie News

‘ఉప్పెన’లో నెట్‌ఫ్లిక్స్ వార్నింగ్


కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు పది నెలలు ఆలస్యంగా, ఈ శుక్రవారం విడుదలైంది ‘ఉప్పెన’ సినిమా. కరోనా టైంలో ఈ చిత్రానికి ఓటీటీల నుంచి మంచి మంచి ఆఫర్లు వచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటి అన్న ఉద్దేశంతోనో ఏమో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తొందరపడలేదు.

థియేటర్లు తెరుచుకోవడంలో బాగా ఆలస్యం జరిగినా వేచి చూశారు. థియేటర్ల పున:ప్రారంభం తర్వాత కూడా సినిమాను రిలీజ్ చేసే విషయంలో తొందరపడలేదు. చివరికి సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి, మంచి టైమింగ్ చూసి ఈ వారం విడుదల చేశారు. సినిమాకు అన్నీ కలిసొచ్చి అనూహ్యమైన హైప్ వచ్చింది. ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ రాబోతున్నాయని స్పష్టమైంది. సినిమా ‘హిట్’ స్థాయి అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

ఐతే ‘ఉప్పెన’ టైటిల్స్‌ ఆరంభంలోనే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అతి త్వరలోనే రిలీజ్ కాబోతోందని అనౌన్స్‌మెంట్ ఇచ్చేయడం విశేషం. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ అని చెప్పడమే ఎక్కువంటే.. కమింగ్ సూన్ అని కూడా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తూ అతి త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోందని చెప్పడమంటే ఎగ్జిబిటర్లకు మంట పుట్టించేదే. అదే సమయంలో ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమా చూడాలనేమీ లేదని.. త్వరలోనే ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసుకోవచ్చని హింట్ ఇస్తున్నట్లే.

బహుశా మాస్టర్, క్రాక్ సినిమాల మాదిరే ఈ చిత్రాన్ని కూడా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేలా పెద్ద మొత్తానికి ఒప్పందం చేసుకుని ఉండొచ్చేమో. ఇలా థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు మధ్య గ్యాప్ అంతకంతకూ తగ్గిపోతుండటం పట్ల ఇప్పటికే ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఉప్పెన’ విషయంలోనూ అలాగే జరిగితే వాళ్లెలా స్పందిస్తారో చూడాలి మరి.

This post was last modified on February 12, 2021 7:16 pm

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

53 minutes ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

1 hour ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

2 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

3 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

4 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

8 hours ago