సుడిగాలి సుధీర్ తో రష్మీ ఈక్వేషన్!

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తో కమెడియన్ సుడిగాలి సుధీర్ పరాచికాలు ఆడుతూ ఉండడం, ఆమెని ప్రేమిస్తున్నట్టు పలుమార్లు చెప్పడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని చాలా మందికి డౌట్ ఉంది. తమ మధ్య రిలేషన్ గురించి ఇద్దరూ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేసారు. అయితే సుడిగాలితో తన రిలేషన్ ఏమిటనేది రష్మి క్లారిఫై చేసేసింది.

జబర్దస్త్ సెట్లో తప్ప తమ మధ్య కనీసం బయట కలుసుకునే స్నేహం కూడా లేదని, స్క్రిప్ట్ ని బట్టి సెట్లో నటిస్తూ ఉంటామని, ఇద్దరం మంచి నటులమని రష్మి తేల్చేసింది. పెళ్లి తన వ్యకిగత విషయం అంటూనే ఖాయం అయినపుడు చెప్తానని అంది.

లాక్ డౌన్ టైంలో వైజాగ్ లో కుటుంబంతో ఉన్నానని, పొద్దున్న, సాయంత్రం వీధి కుక్కలకి భోజనం పట్టుకెళ్లి పెడుతున్నానని, అదే తనకి టైం పాస్ అని చెప్పింది.