ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్, ఒక కొత్త దర్శకుడు.. ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే దానికి అనుకున్నంతగా హైప్ రాదు. ఆ సినిమా జనాల దృష్టిలో పడటమే చాలా కష్టమవుతుంది. ఇక ఇలాంటి సినిమా చూద్దామని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి కూడా ఉండదు. కానీ ‘ఉప్పెన’ మాత్రం ఇందుకు మినహాయింపు. మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. కృతి శెట్టి అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినపుడు పెద్దగా ఏమీ హైప్ కనిపించలేదు. కానీ ఈ చిత్రానికి ఒక్కొక్కటిగా ప్రోమోలు వదలడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ప్రతి ప్రోమోలోనూ ఒక అభిరుచి, ఫీల్ కనిపించాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు మోత మోగించేశాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
అనుకున్న దాని కంటే పది నెలలు ఆలస్యంగా విడుదలవుతున్నా సరే.. ‘ఉప్పెన’కు కనిపిస్తున్న హైప్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక స్టార్ సినిమా స్థాయిలో దీనికి బజ్ ఉందిప్పుడు. ఇందుకు మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒక కారణం. మెగాస్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు సుకుమార్.. ఇంకా కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, హరీష్ శంకర్, శివ నిర్వాణ లాంటి క్రేజీ డైెరక్టర్లు ఈ ఈవెంట్‌కు వచ్చి సినిమా గురించి ఓ రేంజ్‌లో చెప్పారు.
సుక్కు ఇది వంద కోట్ల సినిమా అంటే.. చిరు ఏమో భారతీరాజా క్లాసిక్స్‌తో పోల్చేశాడు. విజయ్ సేతుపతి సైతం ఈ వేడుకకు హాజరై తాను ఎందుకు ఈ సినిమా చేశానో వివరించాడు. ఆ వేడుక సూపర్ హిట్టయింది. సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. ఓపెనింగ్స్ విషయంలో సినిమాకు ఢోకానే ఉండదు. కానీ అవసరానికి మించి పెరిగిపోయిన అంచనాలను అందుకోవడం ఇప్పుడు ‘ఉప్పెన’కు ఉన్న సవాల్.
చిరు సహా ఒక్కొక్కరు సినిమా గురించి చెప్పడం చూస్తే ఒక క్లాసిక్ చూడబోతున్నామన్న అంచనాలతో థియేటర్లకు రానున్న ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదు. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువగా ఉన్నా ప్రేక్షకులు పెదవి విరుస్తారు. మరి ‘ఉప్పెన’ వారిని ఎలా మురిపిస్తుందో?
This post was last modified on February 8, 2021 4:28 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…