అన్షు.. తెలుగులో ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఆ అమ్మాయిని మరిచిపోలేరు. తన తొలి చిత్రంతో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. మన్మథుడు సినిమాలో సోనాలి బింద్రే కూడా చక్కటి పాత్రతో మెరిసింది కానీ.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మహేశ్వరి పాత్ర యువ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్లుగా ఎంతో సున్నితమైన అందం, నటనతో అన్షు అందరినీ ఆకట్టుకుంది.
రెండో సినిమా రాఘవేంద్ర ఫ్లాప్ కావడంతో అన్షు ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి అదృశ్యం అయిపోయింది. తర్వాత ఇంకెక్కడా కూడా కనిపించలేదు. ఆమె చాలా ఏళ్ల కిందటే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిపోయింది. ఐతే మన్మథుడు వచ్చిన 17 ఏళ్ల తర్వాత ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఓ ఆసక్తికర కబురు చక్కర్లు కొడుతోంది.
తన రచనతో మన్మథుడు సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టిన త్రివిక్రమ్.. ఇప్పుడు తన దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఓ కీలక పాత్రకు అన్షును తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు.. ఇక అప్పట్నుంచి ఎన్టీఆర్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మేలో మొదలయ్యే అవకాశముంది. ఇందులో ఎన్టీఆర్ అక్కగా సినిమాలో కీలక పాత్రకు అన్షును అడిగారట.
సినిమాల మీద ఆసక్తే లేనట్లు వెళ్లిపోయిన అన్షు.. ఈ క్రేజీ ప్రాజెక్టులో చేయడానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆమె ఈ సినిమాలో నటిస్తే మన్మథుడు సినిమాను మధుర జ్ఞాపకంగా మార్చుకున్న ఎంతోమంది ప్రేక్షకులకు ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి వార్త ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on February 8, 2021 11:03 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…