కన్నడలో రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా కవుల్దారి. రిషి అనే పెద్దగా పేరు లేని హీరోను పెట్టి హేమంత్ రావు ఈ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఇది తమిళ నిర్మాత ధనుంజయన్‌కు బాగా నచ్చేసి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌కు శ్రీకారం చుట్టాడు. ముందు రాజశేఖర్‌ను లీడ్ రోల్‌కు ఎంచుకున్నారు కానీ.. ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి సుమంత్ వచ్చాడు.
తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించాడీ సినిమాలో. ఇంతకుముందు విజయ్ ఆంటోనీ హీరోగా బేతాళుడు అనే సినిమా తీసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. గత నెల చివర్లోనే తమిళ వెర్షన్ విడుదలైంది మంచి రివ్యూలు కూడా తెచ్చుకుంది. బాగానే ఆడుతోంది. తెలుగులో మాత్రం విడుదల విషయంలో కొంచెం జాప్యం జరిగింది.
తెలుగులో కపటదారి పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు నిర్ణయం మారింది. వారం ముందుగా, అంటే ఫిబ్రవరి 19నే కపటదారి విడుదల కాబోతోంది. నిజానికి ఈ తేదీన నితిన్ సినిమా చెక్ రావాల్సింది. కారణాలేంటో తెలియదు కానీ ఆ సినిమాను అనూహ్యంగా 26కు వాయిదా వేశారు.
ఇప్పటికే ఆ రోజుకు ఎ1 ఎక్స్‌ప్రెస్, అక్షర సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. చెక్ కూడా వస్తే పోటీ మరీ ఎక్కువవుతుంది. ఎలాగూ ఫస్ట్ కాపీతో రెడీగా ఉండటంతో అంత పోటీలో ఎందుకని ఖాళీ అయిన ముందు వారాన్ని ఎంచుకున్నట్లుంది కపటదారి టీం. మళ్ళీ రావాతో ఫామ్ అందుకున్నట్లే అందుకుని మళ్లీ తడబడ్డ సుమంత్‌కు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. ట్రైలర్ చూస్తే ఈసారి అతను మంచి ఫలితాన్నే అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on February 6, 2021 11:13 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…