దిల్ రాజు ఇలా చెడగొట్టుకుంటున్నాడేంటి?

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఈ మధ్య వరుసగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. సంక్రాంతి సమయంలో తాను రిలీజ్ చేసిన ‘క్రాక్’ సినిమాకు సరిపడా, సరైన థియేటర్లు ఇవ్వకుండా దిల్ రాజు కుట్ర చేస్తున్నాడంటూ వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాని మీద కొన్ని రోజుల పాటు టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే నడిచింది.

కట్ చేస్తే నేచురల్ స్టార్ నాని సినిమా ‘టక్ జగదీష్’ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చాలా ముందుగానే ప్రకటన రాగా.. అదే సమయానికి నాగచైతన్య-సాయిపల్లవి ల ‘లవ్ స్టోరి’ని షెడ్యూల్ చేయడంలో రాజు పాత్ర గురించి చర్చ నడిచింది. ఇది దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమా కాదు. కానీ దీని నిర్మాత ఏషియన్ సునీల్‌తో రాజుకు మంచి సంబంధాలున్నాయి. ‘లవ్ స్టోరి’ విడుదలలో రాజు భాగస్వామ్యం కూడా ఉంది.

ఈ విషయం తెలిసి నాని చాలా హర్టయ్యాడని, రాజుకు ‘నేను లోకల్’, ‘ఎంసీఏ’ లాంటి పెద్ద హిట్లు ఇచ్చిన తనను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని సన్నిహితుల దగ్గర వాపోయాడని గుసగుసలు వినిపించాయి. నానీతో ఇలా చెడగొట్టుకున్న దిల్ రాజు.. ఇప్పుడు తన సన్నిహితుడైన సురేష్ బాబుతో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతుండటం గమనార్హం.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయిందని తెలిసి కూడా బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి రాజు నిర్మిస్తున్న ‘పాగల్’ను అదే తేదీకి బరిలో నిలిపారు. రానా సినిమాకు విశ్వక్ సినిమా పెద్ద పోటీ కాకపోయినా.. ఒకరు డేట్ ఇచ్చాక ఇలా అదే రోజు మరో సినిమాను రేసులో నిలపడం టాలీవుడ్ సర్కిల్స్‌లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇలా దిల్ రాజు వరుసగా అందరితో సంబంధాలు చెడగొట్టుకుంటున్నాడేమిటనే కామెంట్లు వినిపిస్తున్నాయి.