Movie News

టాలీవుడ్ అత్యుత్సాహం.. షాక్‌లు తప్పవు

కొన్ని రోజులుగా టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర ఎలా సాగుతోందో తెలిసిందే. ఒకరిని చూసి ఒకరు వరుసబెట్టి రిలీజ్ డేట్లు ఇచ్చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి సైతం అప్పుడే ప్రకటన ఇచ్చేశారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు పది క్రేజీ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు.

మామూలుగా ఒక ఏడాదిలో రిలీజయ్యే సినిమాలతో పోలిస్తే గత ఏడాది నాలుగో వంతు మాత్రమే విడుదలైన నేపథ్యంలో ఈ ఏడాది మ్యాడ్ రష్ చూడబోతున్నాం బాక్సాఫీస్‌లో. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో ఒక సినిమా మీద ఒకటి పడబోతోంది. అన్ సీజన్ అని కూడా చూడకుండా బోలెడన్ని సినిమాలను రేసులో నిలబెట్టేశారు. ఐతే టాలీవుడ్ నిర్మాతలు మరీ అత్యుత్సాహం చూపిస్తున్నారని, దీని వల్ల ప్రతికూల ప్రభావం పడినా పడొచ్చని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.

ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, అటు ప్రేక్షకులకు ఆప్షన్లు మరీ ఎక్కువైనపుడు సినిమాలకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరుగుతుందా అన్నది సందేహం. ఉదాహరణకు అన్ సీజన్ అయిన మార్చిలో మహాశివరాత్రి పండుగను చూసుకుని ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అన్ని చిత్రాలు పోటీలో ఉన్నపుడు ఏ సినిమాకూ ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్ రాదు.

సంక్రాంతి లాంటి సీజన్లో అయితే ఇలా ఎక్కువ సినిమాలు పోటీ పడ్డా ఇబ్బంది లేదు. కానీ అసలే తక్కువ వసూళ్లు వచ్చే సీజన్లో ఇలా నాలుగు సినిమాలు పోటీ పడితే ఎక్కడ స్కోప్ ఉంటుంది? దీంతో అయిన కాడికి సినిమాను అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక ఇన్ని ఆప్షన్లు ఉన్నపుడు ప్రేక్షకులు ‘ది బెస్ట్’ అనిపించుకున్న సినిమాను చూస్తారు. మిగతా వాటి జోలికే వెళ్లరు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అన్యాయం అయిపోతుంది.

గత ఏడాది థియేటర్లలో పెద్దగా సినిమాలు చూడలేదు కాబట్టి ఈసారి ప్రేక్షకులు ఆ లోటంతా తీర్చేసుకుంటాడని, సినిమాల మీద అదనంగా ఖర్చు పెడతాడని నిర్మాతలు అంచనా వేస్తున్నారేమో. కానీ గత ఏడాది థియేటర్లలో సినిమాలు చూసేందుకు పెట్టాల్సిన ఖర్చునంతా ఓటీటీలకు మళ్లించారు ప్రేక్షకులు. కాబట్టి ఈ ఏడాది మరీ ఎగబడి సినిమాలు చూసేస్తారని అనుకోవడానికి లేదు. అవసరానికి మించి కంటెంట్ ఇస్తే వాళ్లు కూడా తట్టుకోలేరు. చాలా బాగుందని టాక్ తెచ్చుకున్న, క్రేజీ సినిమాలు మాత్రమే చూస్తారు.

మహా శివరాత్రి అనే కాదు.. ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ చూడబోతున్నాం. విరామం తర్వాత అవకాశం దొరికింది కదా అని నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ.. కంటెంట్ మరీ ఎక్కువైతే ప్రేక్షకులు ఛాయిస్ తీసుకుంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలా సినిమాలు ఎక్కువైనపుడు టాక్ సరిగా లేని సినిమాలకు దెబ్బ మామూలుగా ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి.

This post was last modified on February 2, 2021 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లాప్ హీరోయిన్ ఫేవరెట్ అయిపోయింది

దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి. అది ఉండబట్టే…

21 minutes ago

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన…

52 minutes ago

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు…

55 minutes ago

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే…

2 hours ago

టాలీవుడ్ సినిమాలతో అనిరుధ్ బిజీ బిజీ

నిన్నటి దాకా దొరకడమే మహా కష్టం, ఏదైనా వర్క్ చేయించుకోవడం అంత కన్నా సవాల్ అనే రీతిలో ఉన్న అనిరుధ్…

2 hours ago

మ‌హిళ‌లకు పండ‌గే.. ఆ రెండు ప‌థ‌కాలు ఖాయం!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల ప‌రంపర మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా హామీల్లో కీల‌క‌మైన వాటిని…

3 hours ago