ఆ రెండూ అయ్యాక చిరుతోనే..

మెగాస్టార్ చిరంజీవి య‌మ స్పీడు మీదున్నాడు ఈ మ‌ధ్య‌. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక‌.. ఆయ‌న స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో నాలుగు సినిమాలు ఖ‌రారు చేశారు. అందులో ఒక‌టి.. ఆచార్య‌. అది పూర్తి కావ‌స్తోంది. వేస‌విలో విడుద‌ల‌వుతోంది. దీని త‌ర్వాత చిరు లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించనున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాలం రీమేక్‌లో న‌టిస్తాడు.

ఆపై కె.ఎస్.ర‌వీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అత‌డి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లే ఉంది. ఈ మ‌ధ్యే తాను ప‌ని చేయ‌బోయే ద‌ర్శ‌కుల్లో బాబీ కూడా ఉన్న సంగ‌తి మ‌రోసారి చిరు ధ్రువీక‌రించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల‌న్నీ పూర్తి చేయ‌డానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆ త‌ర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు ప‌చ్చ జెండా ఊపాడ‌న్న‌ది తాజా స‌మాచారం.

ఇటీవ‌లే క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న గోపీచంద్ మ‌లినేనిని చిరు త‌న ద‌గ్గ‌రికి పిలిపించుకుని మ‌రీ అభినందించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా అత‌డితో సినిమా చేయ‌డానికి చిరు అంగీకారం తెలిపాడ‌ట‌. ఇదేదో మాట వ‌ర‌స‌కు అన్న మాట కాద‌ని, నిజంగానే హామీ ఇచ్చాడ‌ని అంటున్నారు. గోపీచంద్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేయ‌బోతున్నాడ‌న్న‌ది టాక్. అ

లాగే క్రాక్ హిందీ రీమేక్‌కు కూడా అత‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. కొంచెం ముందు వెనుక‌గా ఈ రెండు సినిమాలను అవ‌గొట్టి.. ఆ త‌ర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు ప‌నిలో ప‌డ‌తాడ‌ట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో క‌చ్చితంగా వీరి సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. చిరుతో త‌న సినిమా ఓకే అయింద‌ని గోపీచంద్ త‌న స‌న్నిహితుల‌తో చెబుతున్న‌ట్లు తెలిసింది.