తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొన్నేళ్ల కిందట రామాయణ గాథతో భారీ సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రకటన వచ్చాక చాలా సమయం గడిచిపోయింది. ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఒక దశలో ఈ చిత్రం ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి.
కానీ అతి త్వరలో అల్లు వారి రామాయణం సెట్స్ మీదికి వెళ్లబోతోందని తెలుస్తోంది. అరవింద్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. ముంబయిలో మధు మంతెన చకచకా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఎపిక్ మూవీలో రావణుడి పాత్రను పోషించేదెవరన్న దానిపై స్పష్టత వచ్చేసినట్లే అంటోంది బాలీవుడ్ మీడియా.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడట. దీని గురించి ఇంతకముందే ఊహాగానాలు నడిచాయి కానీ.. ఇప్పుడు అతనే రావణుడిగా ఖరారైనట్లు బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలిస్తోంది. హృతిక్ అనగానే రాముడి పాత్ర చేస్తాడేమో అనుకుంటాం కానీ.. అతణ్ని రావణుడి పాత్రకు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రంలో సీతగా దీపికా పదుకొనే కనిపించబోతోందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కానీ అత్యంత కీలకమైన రాముడి పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. హృతిక్ చేశాడంటే రావణుడి పాత్ర స్థాయే మారిపోతుంది. అలాంటపుడు రాముడిగా అతణ్ని మించిన హీరో ఉండాలి. మరి ఆ పాత్ర ఎవరు చేస్తారో ఏమో? దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, అంతకంటే ముందు గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 31, 2021 10:55 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…