సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో చిరంజీవికి ఎదురవుతున్న సందిగ్దత గురించి నెలరోజులకు పైగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. విశ్వంభర ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆర్టిస్టుల డబ్బింగ్ పూర్తి చేయడంతో పాటు ట్రైలర్ కట్ రెడీ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తోంది. మెగావర్స్, కాకా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్న మెగాస్టార్ కి ఇదంతా కొలిక్కి తేవాలంటే ముందు మధ్యవర్తిత్వం చేయాలి.
కేవలం వారం రోజుల గ్యాప్ లో లేదా ఒకే రోజు విడుదలవుతాయనే పుకారు సోషల్ మీడియాలో బలంగా తిరుగుతోంది. దీన్ని ఫ్యాన్స్ స్వాగతించడం లేదు. ఏదో ఒకటే రావాలని, పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ సినిమాలకు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి తమకు సెలెబ్రేట్ చేసుకోవడానికి ఉన్నవి రెండే కనక మధ్యలో గ్యాప్ ఉండాలనేది వాళ్ళ డిమాండ్. మరి కాకా వెనక్కు తగ్గుతాడా లేక విశ్వంభర వాయిదా పడి వెనక్కు వెళ్తుందానేది ఎవరికి అర్థం కానీ అతి పెద్ద రహస్యం.
అందుకే నవంబర్ నెల అయిపోతున్నా ఎవరికి వారు ప్రమోషన్లు మొదలుపెట్టకుండా సైలెంట్ ఉన్నారు. కాకా మొదటి పాట డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ చేయడం దాదాపు కన్ఫర్మ్. కానీ టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ నోట్ రాలేదు. అటు విశ్వంభర నుంచి అందరూ ఎదురు చూసేది ట్రైలర్ మాత్రమే. ఆడియో ఆల్రెడీ సోసో రెస్పాన్స్ తెచ్చుకుంది. మిగిలిన పాటల మీద జనాల్లో ఏమంత ఎగ్జైట్ మెంట్ లేదు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసమే ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
ముందైతే చిరంజీవి రంగంలోకి దిగి దీనికి పరిష్కారం సెట్ చేయాలి. ఇలా నాన్చుతూ పోతే ప్రమాద సంకేతాలు వెళ్తాయి. ఏదో ఒక చిరంజీవి సినిమా వస్తే చాలని జనం అనుకోవడం లేదు. పండక్కు కాకా రైట్ ఛాయసని భావిస్తున్నారు. అయితే విశ్వంభర ప్రీ రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్న నేపథ్యంలో త్రాసు ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. సంక్రాంతికి అటుఇటుగా ఇంకో నలభై రోజులు మాత్రమే టైం ఉంది. అందుకే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే బజ్ పరంగా రిస్క్ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates