టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కు ఉన్న క్రెడిబిలిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ వేరు. ఆయన తీసే సినిమాలే కాదు ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సుకుమార్ ఏదైనా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆ సినిమా ఆషామాషీగా ఉండదు ప్రేక్షకులు అని ప్రేక్షకులు నమ్ముతారు. కుమారి 21ఎఫ్ విరూపాక్ష లాంటి సినిమాలు అందు ఉదాహరణ. ఇప్పుడు సుకుమార్ చెయ్యి పడ్డ మరో స్క్రిప్ట్ సినిమాగా రూపొందింది. అదే వృషకర్మ. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు నుంచి రాబోతున్న కొత్త చిత్రం ఇది.
నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే దీని రేంజ్ వేరని అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగాయి. కాన్సెప్ట్, విజువల్స్, మిగతా టెక్నికల్ అంశాలు, హీరో – విలన్ క్యారెక్టర్లు అన్ని అన్ని వేరే లెవల్ అనిపించాయి. ఈ సినిమా ఏదో అద్భుతం చేస్తుందనే అంచనాలు కలిగాయి.
ఈ సినిమాలో ఇంత క్వాలిటీ కనిపిస్తుండడానికి సుకుమార్ కారణం అనే చర్చ జరుగుతుంది. పోస్టర్ మీద సుకుమార్ రైటింగ్స్ పేరుపడ్డ ప్రతి చిత్రం గొప్పగా ఉంటుందని కాదు. తనకు బాగా నచ్చిన కథ అయితే ఆయన కూడా స్క్రిప్ట్ లో, మేకింగ్ లో భాగమవుతారు. అలాంటప్పుడు అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో విరూపాక్షలో అందరూ చూశారు. కార్తీక్ తర్వాత చిత్రం వృషకర్మ కథ కూడా సుకుమార్ కు నచ్చి స్క్రీన్ ప్లే లో ఆయన భాగం అయినట్లు సమాచారం. ఈ మూవీ మేకింగ్ కూడా ఆయన పర్యవేక్షణలో జరిగిందట. అలాగే ఎడిటింగ్ కూడా సుకుమార్ దగ్గరుండి చూసుకున్నట్టు సమాచారం. ట్రైలర్ కట్ లో కూడా ఆయన చేయి పడిందట.
ఆల్రెడీ ఇండస్ట్రీలో వృషకర్మ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ట్రైలర్ తో ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా గట్టిగా కొడుతుందని, నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. సాయంతో మరి తన గురువు సాయంతో కార్తీక్ దండు ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates