పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న తీరు ఒక కేస్ స్టడీలా మారింది. ఎందుకంటే రెండు మూడేళ్లు కష్టపడినా హిట్ వస్తుందనే గ్యారెంటీ లేని ప్యాన్ ఇండియా ప్రపంచంలో చాలా సింపుల్ కథలతో, తెలివైన కాంబోలతో బ్లాక్ బస్టర్లు సాధిస్తున్న జూనియర్ మమ్ముట్టిని చూసి ఎవరైనా ఈర్ష్య పడితే అందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. తాజాగా వచ్చిన ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుని డీసెంట్ నుంచి సూపర్ హిట్ వైపు పరుగులు పెడుతోంది.
దుల్కర్ నటించిన తెలుగు సినిమాల వరస చూస్తే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ మూడు ఒకదాన్ని మించి మరొకటి అద్భుత విజయాలు సాధించాయి. బయ్యర్లకు లాభాల పంట పండించాయి. క్యామియో చేసిన కల్కి 2898 ఏడి సైతం ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఒక్క ఛాంపియన్ గెస్ట్ రోల్ మాత్రమే అంచనాలకు తగ్గట్టు నిలబడలేదు. అది స్వప్న బ్యానర్ కావడంతో పాత్ర గురించి ఆలోచించలేదు కానీ లేదంటే ఆ సెలక్షన్ విషయంలో కూడా తొందరపడేవాడు కాదేమో.
ట్రాక్ రికార్డు చాలా బాగుంది కానీ ఇదంతా దుల్కర్ సల్మాన్ అవగాహన వల్ల వచ్చిన సక్సెసా లేక అదృష్టమా అంటే రెండూ మిక్స్ అని చెప్పాలి. ఎందుకంటే మల్లువుడ్ లో దుల్కర్ కి ఈ స్థాయి హిట్లు పడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐ యామ్ గేమ్ తీవ్రంగా నిరాశపరిచింది. హ్యాండిల్ చేసింది మంచి దర్శకుడే అయినా బాగా ఫీలయ్యే చేదు ఫలితం దక్కింది. అంతకు ముందు కింగ్ అఫ్ కోత ఫ్లాప్ కాగా సెల్యూట్ అంచనాలు అందుకోలేదు. చివరి విజయం కురుప్ 2021లో వచ్చింది.
అంటే ఈ అయిదు సంవత్సరాల కాలంలో దుల్కర్ ని ట్రాక్ లో పెట్టుకుంటూ వచ్చింది టాలీవుడ్డే. కాకపోత టాలెంటెడ్ దర్శకులకు ఎస్ చెప్పడం వల్ల ఇవన్నీ సాధించగలుగుతున్నాడు. నెక్స్ట్ విడుదలకు రెడీగా ఉన్న శ్రీశ్రీ మీద కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలు చూస్తున్నారు. ఇది కూడా వర్కౌట్ అయితే మన దగ్గర టయర్ 2 స్టార్ గా దుల్కర్ కి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఇంత సెలెక్టివ్ గా ఉన్నందుకు లక్కీ దుల్కర్ అనాల్సిందే.
This post was last modified on November 23, 2026 10:36 am
రాజస్థాన్ కావొచ్చు... ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు…
మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరికి…
బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే వెంటనే వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తాం. అయితే చాలామంది మాత్రం బ్రాండ్ ఏదైనా సరే…
వైసీపీ అధినేత జగన్.. ఆ పార్టీ నాయకులకు మంత్రి నారా లోకేష్ సవాల్ రువ్వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన…
మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…
టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…