ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని ఇటీవల రాజమౌళి ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు తారక్ అంకితమై రెండేళ్లు దాటిపోయింది. రామ్ చరణ్ అయినా మధ్యలో బ్రేక్ తీసుకుని ఆచార్యలో ప్రత్యేక పాత్ర కోసం షూటింగ్‌కు హాజరవుతున్నాడు. కానీ తారక్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా చిత్రీకరణకే పరిమితం అవుతున్నాడు.
రాజమౌళితో సినిమా అంటే ఎంతకీ తెగని వ్యవహారం. పరిస్థితి చూస్తే తారక్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ వచ్చేసేలా కనిపించింది. ఈ ఏడాది ఇంకో సినిమా మొదలుపెడతాడా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి ఒక సమయంలో. ఐతే క్లైమాక్స్ చిత్రీకరణతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు అయిపోతుందని, తారక్ ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా నుంచి విముక్తుడవుతాడని సంకేతాలు రావడం అతడి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
మరి కొన్ని నెలల్లోనే తారక్ త్రివిక్రమ్‌తో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది. మే 20న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతాడట. అక్కడ్నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందట. త్రివిక్రమ్ కూడా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇంకెంతమాత్రం ఆలస్యం చేయాలనుకోవట్లేదు.
అరవింద సమేత తర్వాత వీళ్లిద్దరూ మరోసారి హారిక అండ్ హాసిని బేనర్లోనే ఈ సినిమాచేయనున్నారు. ఆ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమనే దీనికీ సంగీత దర్శకుడు. తారక్ సరసన ఓ కథానాయికగా జాన్వి కపూర్‌ను తీసుకుందామని అనుకుంటున్నారట. ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో నడుస్తుందంటున్నారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 26, 2021 8:34 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…