కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం లేని కథను అతిగా అంచనా వేసి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో తను చేసిన యాక్షన్ గ్రాండియర్ బొక్క బోర్లా పడటం ఇప్పట్లో ఫ్యాన్స్ మర్చిపోలేరు. రెండోది రామాయణ. కెరీర్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు రావణుడిగా నటించడం ఏమిటనే కామెంట్స్ స్వంత అభిమానుల నుంచే వచ్చాయి. కేవలం యాక్ట్ చేయడమే కాదు అందులో నిర్మాణ భాగస్వామి కూడా అయ్యాడు.
రామాయణ చూశాక జనాలకు ప్రధానంగా కలిగిన ఫీలింగ్ ఒకటే. రాముడిగా రన్బీర్ కపూర్ కన్నా రావణ క్యారెక్టర్ లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని. క్రూరత్వాన్ని, కాంక్షని బ్యాలన్స్ చేస్తూ చాలా సీరియస్ ఎక్స్ ప్రెషన్లతో తను పండించిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు నితేశ్ తివారి డిజైన్ చేసిన పద్దతి దానికి బాగా దోహదపడింది. నటన పరంగా కెజిఎఫ్ తర్వాత ఎక్కువ కాంప్లిమెంట్స్ దీనికే వస్తున్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
నిర్ణయం పరంగా యష్ చేసింది రైటేనా అంటే ఔనని చెప్పాలి. ఎందుకంటే రామాయణ గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అవుతోంది. క్రమంగా అన్ని దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే యుఎస్, యుకె లాంటి దేశాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రీచ్ గట్టిగానే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అదే జరిగితే యష్ మరింతగా అధిక శాతం ప్రేక్షకులకు చేరువవుతాడు. టాక్సిక్ తో తాను ఏదైతే సాధించాలని అనుకున్నాడో దాన్ని ఇప్పుడు సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు.
ఇక అసలైన యష్ విశ్వరూపం రామాయణ పార్ట్ 2లో ఉంటుంది. కానీ రెండేళ్లు వెయిట్ చేస్తే తప్ప చూడలేం. 2028 రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకోవడంతో బాహుబలి తరహాలో లాంగ్ వెయిటింగ్ తప్పదు. ఇవి కాకుండా యష్ ఇంకే సినిమాలు ఒప్పుకోలేదు. రామాయణ 2కి ఎన్ని డేట్స్ ఇవ్వాలనేది ఫిక్స్ అయ్యాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇద్దరు దర్శకులు కథలు చెప్పారు కానీ ఇంకా యష్ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదట. టైం పట్టొచ్చని టాక్.
This post was last modified on November 7, 2026 1:15 pm
చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…
కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…
డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…
స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం.…
బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…
అమ్మ బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు జనం. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు, సోదరుడు అనిల్ రెడ్డి…