సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అయినా.. అందులో హీరో బాధ్యత తక్కువే అంటున్నాడు యువ నటుడు మౌళి. యూట్యూబ్ ఫన్నీ వీడియోలతో ప్రయాణం మొదలుపెట్టి.. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ సిరీస్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడి.. ‘లిటిల్ హార్ట్స్’తో హీరోగా సెన్సేషనల్ హిట్ కొట్టిన మౌళి.. ఇప్పుడు ‘డీఎన్‌కే’ (దొంగ నా కొడుకు) చిత్రంతో వస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ప్రధాన బాధ్యత దర్శకుడిదే అని తేల్చేశాడు. సినిమా ఫ్లాప్ అయితే హీరోను తిట్టడం కరెక్ట్ కాదని అతనన్నాడు.
‘‘ఒక సినిమాకు సంబంధించి దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్‌ను బట్టే ఏదైనా ఉంటుంది. హిట్టయినా.. ఫ్లాప్ అయినా దర్శకుడిదే బాధ్యత. హిట్టయితే యాక్టర్ మీదికి వస్తుంది అంటే.. అతను ఎక్కువగా కనిపిస్తాడు కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ హిట్ సినిమా తీస్తే ఇండస్ట్రీలో ఆ దర్శకుడికి ఉండే గౌరవం వేరు. సినిమా హిట్టయినా, ఫ్లాపైనా దర్శకుడి అకౌంట్లోకే వెళ్తుంది. ఒక యాక్టర్ సరిగా చేయలేదు అంటే.. అలా చేయించుకోలేకపోవడం కూడా దర్శకుడి తప్పే అవుతుంది. ఫ్లాప్ అయితే దర్శకుడినే ఎక్కువ తిడతారు అంటే.. హిట్టయినా తనకే ఎక్కువ పేరొస్తుంది కదా. సినిమా ఫ్లాప్ అయితే హీరోకు బాగానే డ్యామేజ్ జరుగుతుంది. కానీ హీరోను తిట్టడం కరెక్ట్ కాదు’’ అని మౌళి అన్నాడు.
‘లిటిల్ హార్ట్స్’ అంత సెన్సేషన్ క్రియేట్ చేశాక మౌళి హడావుడి పడకుండా.. హీరోగా రెండో సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరించాడు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లో ‘డీఎన్‌కే’ చేశాడు. ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’ తరహాలోనే ఇది కూడా ఫన్ ఎంటర్టైనర్ అని.. కాకపోతే ఇందులో లవ్ బదులు క్రైమ్ ఉంటుందని ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది. ఈ నెల 13న ‘డీఎన్‌కే’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
This post was last modified on November 8, 2026 1:42 am
కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13…
మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు…
దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…
నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు.…
వైసీపీ సీనియర్ నేత, శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వారసురాలిగా రాజకీయ అరం గేట్రం చేసిన బొత్స…