ఎడతెగని సస్పెన్స్‌కు తెర దించుతూ ఇటీవలే ఆచార్య సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. అతడి పాత్ర పేరు సిద్ధ అని.. అది కొంచెం ట్రెడిషనల్ స్టయిల్లో ఉంటుందని ఇటీవల చరణ్ ఆచార్య సెట్లోకి వచ్చిన సందర్భంగా రిలీజ్ చేసిన ప్రిలుక్‌ను బట్టి అర్థమైంది. ఈ పాత్రకు సినిమాలో హీరోయిన్ కూడా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రను ఎవరు చేస్తారనే విషయంలో రకరకాల ప్రచారాలు నడిచాయి.
ఐతే తాజా సమాచారం ప్రకారం ఇందులో చరణ్‌తో జోడీ కట్టబోయేది పూజా హెగ్డే అట. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ అనదగ్గ పూజాతో చరణ్‌కు జోడీ కట్టిస్తే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని చిత్ర బృందం భావించిందట.
చరణ్‌తో పూజా హెగ్డే పని చేయడం ఇది తొలిసారి కాదు. రంగస్థలం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి జిగేల్ రాణి పాటలో స్టెప్పులేశారు. ఆ సినిమాకు ఆ పాట హైలైట్‌గా నిలిచింది. పాటలో ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
ఇప్పుడు చరణ్‌కు జోడీగానే పూజా నటించనుందంటున్నారు. వచ్చే రెండేళ్ల వరకు ఖాళీ లేని విధంగా ప్యాక్ అయిపోయి ఉంది పూజా షెడ్యూల్. అయితే ఆచార్య కోసం ఆమె ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యామియో తరహా రోల్ కావడంతో డేట్లు సర్దుబాటు చేయడం కష్టం కాకపోవచ్చు. త్వరలోనే ఆచార్యలో పూజా భాగమైన విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజైన ఐకానిక్ డేట్‌కు ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates