రామాయణ ఎక్కడిదాకా దూసుకెళ్తుంది

బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ట్రేడ్ వర్గాల నిరీక్షణ ఫలించింది. రామాయణ పార్ట్ 1 విడుదలకు ముందు బజ్ ఎలా ఉందనేది పక్కనపెడితే పబ్లిక్ టాక్, రివ్యూలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం కలెక్షన్లకు దోహదపడుతోంది. రెండు రోజులకే రెండు వందల ముప్పై కోట్లకు కొంచెం అటుఇటుగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించడం చిన్న విషయం కాదు. వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా భారీగా ఉన్నాయి.

ట్రైలర్, టీజర్ టైంలో విఎఫ్ఎక్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినప్పటికీ బిగ్ స్క్రీన్ మీద అసలు సినిమాని ఎక్స్ పీరియన్స్ చేశాక వాటిలో చాలా మటుకు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా ఆదిపురుష్ తో పోల్చుకుంటే ఇది ఎంతో గొప్పగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిడివి పరంగా కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ విజువల్ గా రామాయణ ఇస్తున్న అనుభూతి, మొదటి భాగం అసంపూర్ణంగా ముగిసినా అసంతృప్తి కలగకుండా కాపాడింది.

ఇక రామాయణ ఎక్కడిదాకా దూసుకెళ్తుందనే ప్రశ్నకు వస్తే పుష్ప 2, దురంధర్ కలెక్షన్లను దాటుతుందా లేదానే దాని మీద డిస్ట్రిబ్యూటర్లలో వివిధ చర్చలు జరుగుతున్నాయి. రామాయణ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద స్థాయికి వెళ్ళాలి. రిపీట్ ఆడియన్స్ రావాలి. అన్ని వర్గాలకు దగ్గర కావాలి. ఈ విషయంలో ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో ఒక వారం ఆగితే తప్ప చెప్పలేం. ఏపీ తెలంగాణలో చాలా స్టడీగా ఉండటం సంతోషించాల్సిన విషయం.

రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో అందరికన్నా యష్ హైలైట్ అవుతున్నాడు. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. 3డి సాంకేతికత ఇవ్వడంతో చిన్నపిల్లలు, కుటుంబాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఇదే జోరు కనక కనీసం ఒక రెండు వారాలు కొనసాగితే రామాయణ ఈజీగా థౌజండ్ క్రోర్ క్లబ్బుని దాటేస్తుంది. దీని రెండో భాగం ఇంకో రెండేళ్ల తర్వాత అంటే 2028 రిలీజ్ కోసం దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.