కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా హీరో సాయిధరమ్ తేజ్ బ్రహ్మచర్యానికి ముగింపు పలికేస్తున్నాడు. గురువారం అతడి నిశ్చితార్థం పూర్తయింది. పెద్దగా హడావుడి లేకుండా సైలెంటుగా ఎంగేజ్మెట్ చేసుకుని షాకిచ్చాడు తేజు. తన చిన్ననాటి స్నేహితురాలు కిర్మణయిని అతను పెళ్లాడబోతున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక పూర్తయింది.
ఇందులో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు పాల్గొన్నది లేనిదీ స్పష్టత లేదు. రామ్ చరణ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో మాత్రం తేజు తరానికి చెందిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, అల్లు శిరీష్, అల్లు బాబీ, నిహారిక, లావణ్య త్రిపాఠి, సుష్మిత, స్నేహారెడ్డి, ఆద్య, నయనిక.. ఇలా చాలామంది ఉన్నారీ ఫొటోలో.
ఇంకో నెల తర్వాత డిసెంబరు రెండో వారంలో తేజు, కిరణ్మయిల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుక జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తేజుకు ఇప్పటికే 40 ఏళ్లు వచ్చేశాయి. నిజానికి అతను ఇంకా ముందే పెళ్లి చేసుకునేవాడేమో. ఐతే కొన్నేళ్ల ముందు యాక్సిడెంట్ అయి తీవ్ర సమస్యలు ఎదుర్కోవడంతో అతను కోలుకోవడానికి టైం పట్టింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు తేజు. రీఎంట్రీలో ‘విరూపాక్ష’ అతడికి భారీ విజయాన్నందించింది. దీంతో ‘సంబరాల యేటిగట్టు’ లాంటి పెద్ద సినిమాను లైన్లో పెట్టాడు. కానీ ఆ సినిమా బాగా ఆలస్యం అయింది. దాని బడ్జెట్ తడిసిమోపెడైంది. కేపీ రోహిత్ డైరెక్ట చేసిన ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని తర్వాత తేజు నుంచి వచ్చే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates