ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర చేయలేదనే రీతిలో ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఇదే సంవత్సరం తను నటించిన ఇతర బాలీవుడ్ మూవీస్ లో చేసిన గ్లామర్ షోని, బూతు డైలాగులను మర్చిపోయి పెద్దిలో ఏదో మోసం జరిగిపోయిందన్న తరహాలో సింపతీ ప్రదర్శించడం టాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. తాజాగా మహాశక్తి ప్రమోషన్లలో రెజీనా కెసెండ్రా భలే కౌంటర్ ఇచ్చింది.
ఉత్తరాది నటీనటులు ఎవరైనా సౌత్ నార్త్ అంటూ విడగొట్టే తరహాలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే తన దగ్గర కూడా సమాధానం ఉందని చెప్పిన రెజీనా నేరుగా కరణ్ జోహార్ నే టార్గెట్ చేయడం విశేషం. అక్షయ్ కుమార్ భార్యగా కేసరి చాప్టర్ 2 లో నటించిన తరణకు అంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రమోషన్లలో పేరు తీసేశారని, కనీసం ట్యాగ్ కూడా చేయలేదని, పాటను విడుదల చేసి కూడా మెన్షన్ చేయలేదని, ఇదంతా కేవలం దక్షిణాది వాళ్ళ మీద వివక్ష అనుకోవాలా అంటూ కేసరి నిర్మాత కరణ్ ని ప్రశ్నించింది.
ఇందులో చాలా లాజిక్ ఉండటంతో వెంటనే ఆన్సర్ రాకపోవచ్చు. జాన్వీ కపూర్ ఒకరే కాదు ఇటీవలే రాధికా ఆప్టే,. ఇంతకు ముందు తాప్సీ పన్ను అందరూ ఇలా మూలాలు మర్చిపోయి టాలీవుడ్ మీద సెటైర్లు వేసినవాళ్ళే. కాకపోతే రెజీనా లాగా ఎవరూ రివర్స్ పంచ్ వేసే అవకాశాన్ని తీసుకోలేదు. ఇంతే కాదు ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయడం లేదని, నచ్చకపోతే సినిమా ఒప్పుకోకుండా వదలాలి తప్పించి ఏదో మానభంగం జరిగిన తరహాలో గొగ్గోలు పెట్టడం ఏమిటని రెజీనా గడ్డి పెట్టేసింది.
రెజీనా నేరుగా ఎలాంటి పేర్ల ప్రస్తావన తీసుకు రానప్పటికీ తను ఎవరి గురించి అంటోందో పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. మహాశక్తిలో లేడీ విలన్ గా నటించిన రెజీనా ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తోంది. తెలుగులో బజ్ అంతగా లేదు కానీ తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సూర్య సీన్ కు ధీటుగా షోలు వేస్తున్న వైనం స్క్రీన్ కౌంట్ లో కనిపిస్తోంది. రామాయణ వస్తోందని తెలిసి కూడా దానికి పోటీగా నిలవడం వెనుక ధైర్యం ఏమిటో మహాశక్తి చూస్తే కాని క్లారిటీ రాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates