మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నార్మల్ హోండా బైక్‌పై కనిపించారు. గ్రీన్ కలర్ హుడీ వేసుకుని బైక్‌పై కూర్చున్న భీమ్స్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకుడు ఇలా కనిపించడం స్పెషల్ అనే చెప్పాలి. అయితే ఆ బైక్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది.
భీమ్స్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. సంగీతంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినా అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది. ‘ధమాకా’ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. అందులోని పాటలు పెద్ద హిట్ కావడంతో దర్శకనిర్మాతల నుంచి అవకాశాలు పెరిగాయి. అంతకుముందు పలు సినిమాలకు పనిచేసినా ఈ చిత్రంతోనే భీమ్స్ పేరు ఎక్కువమందికి తెలిసింది.
ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరో భారీ మ్యూజికల్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా మాస్ బీట్స్, ఫోక్ ట్యూన్స్ విషయంలో భీమ్స్కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆయన పాటలకు థియేటర్లలో మంచి స్పందన రావడంతో కమర్షియల్ సినిమాల దర్శకులు కూడా భీమ్స్ వైపు చూస్తున్నారు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల ప్రాజెక్టుల వరకు అవకాశాలు అందుకుంటూ కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్నారు.
ఇక వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే, ఇటీవల అన్నపూర్ణ స్టూడియోకు భీమ్స్ ఈ బైక్‌పైనే వచ్చారు. అది తన తండ్రి బైక్ అని స్వయంగా చెప్పారు. ఇలా సింపుల్‌గా ఉండటమే తనకు ఇష్టమని కూడా వివరించారు. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్‌తో పోలిస్తే ఈ ప్రయాణం కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. మరోవైపు భీమ్స్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ పాట నవంబర్ 6న విడుదల కానుంది. నేహా శెట్టితో బెల్లంకొండ కలిసి నటించిన ఈ మాస్ ఫోక్ సాంగ్ ప్రోమో నవంబర్ 5న రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates