Movie News

రేసు నుంచి తప్పుకోనంటున్న దాదా

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా పడి మార్చికి వెళ్లిపోయే ఆలోచనలో ఉందంటూ కొన్ని పుకార్లు ఈ రోజు తెగ షికారు చేశాయి. ప్రమాదం నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకున్న బాలయ్య, మునుపటిలా పూర్తి ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొనడం సాధ్యమవుతున్నప్పటికీ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఆయనకు అనుకూలంగా ఉండేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తోంది.

గాసిప్స్ ని ఖండిస్తూ దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడని యూనిట్ వర్గాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. త్వరలో విడుదల చేయబోతున్న ఫస్ట్ ఆడియో సింగల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఇంకోసారి తేదీని నొక్కి వక్కాణించాయి. పెద్ది ఫేమ్ వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో కాజల్ అగార్వల్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ విలన్ గా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో తన ఎపిసోడ్స్ అదిరిపోయే లెవల్ లో వచ్చాయని టాక్.

దాదా ఇంత పట్టుదలగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. జనవరి నెలలో సంక్రాంతి ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. ఫిబ్రవరి స్టార్ హీరోలకు సరైన సీజన్ కాదు. మార్చి ఏప్రిల్ నెలలో వరసగా ఫౌజీ వారణాసి లాంటి ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. వాటికీ ముందు వెనుక రెండు వారాలు స్పేస్ వదిలేయడం సేఫ్. అలాంటప్పుడు రిస్క్ తీసుకుని వెయిట్ చేయడం కన్నా డిసెంబర్ లో రావడమే బెటర్. పోటీలో నాగార్జున కింగ్ 100, షారుక్ ఖాన్ కింగ్ ఉన్నప్పటికీ ఇబ్బందేం లేదు.

ఇప్పటికైతే మాటకు కట్టుబడి ఉంటానని చెబుతున్న దాదా చేతిలో కేవలం యాభై రోజులు మాత్రమే ఉన్నాయి. కాలానికి ఎదురీదుతూ పరిగెత్తితే తప్ప ఇంత పెద్ద సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావు. అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని, పైకి ఏదో మాఫియా మూవీలాగా కనిపిస్తున్నా మలినేని చాలా విషయాలు దాచి ఉంచారని, ట్రైలర్ లో కొన్ని రివీల్ చేశాక అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయని టీమ్ టాక్. అఖండ 2 తర్వాత బాలయ్య ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని వస్తున్నారు.

This post was last modified on November 4, 2026 10:33 pm

Share

Recent Posts

అక్క వివాదాలు కావాలనే వస్తున్నాయా

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…

1 hour ago

తుఫాను ముంచుకు వస్తోంది తమన్

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…

1 hour ago

ఒకేసారి ఇన్ని పనులు ఎలా చిరు

ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి…

1 hour ago

బీజేపీ వల్లే అనంతపురం చేజారిందా?

ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…

4 hours ago

‘మావిగ‌న్’ ముంచేసింద‌న్నో !

మావిగ‌న్‌.. (మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు న‌గ‌రాల‌తో కూడిన రాజ‌ధాని) జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిందే!. దీనినే త‌మ…

6 hours ago

సందీప్ వీటికి దూరంగా ఉంటే బెటర్

ఇటీవలే అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విద్యార్థినిపై మెషీన్ రంపంతో దాడి జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

6 hours ago