రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతుంది. విజయోత్సలా ఊరేగింపులతో పండుగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యాయి. జనసేన మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ సాధించి ఊపులో వుంది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఫలితాలతో కూటమి మరింత బలోపేతం అయ్యింది. ఇంతటి పాజిటివ్ వాతావరణంలో కూడా పిఠాపురంలో మాత్రం విభిన్నమైన ఫలితాలు వచ్చాయి. అటు టీడీపీ, జనసేనకే కాకుండా ఇటు వైసీపీకి కూడా పిఠాపురంలో విచిత్రమైన అనుభవం కలిగింది.
పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా ఎన్నికలకు ముందే 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో జనసేన 16 వార్డులు, టీడీపీ 5, బీజేపీ 1 వార్డును గెలుచుకున్నాయి. మిగిలిన 10 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఘన విజయం సాధించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. వీరంతా ప్రధాన పార్టీలలో సీటు దక్కకపోవడంతో అధిష్టానాన్ని దిక్కరించి పోటీ చేసిన అభ్యర్థులు కావడం గమనార్హం. రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగి అనూహ్యంగా విజయకేతనం ఎగరేశారు.
జనసేన రెబల్ అభ్యర్థులు 17, 21, 31,34 వార్డుల్లో బరిలో నిలిచి తిరుగులేని విజయం సాధించారు. టీడీపీ రెబల్ అభ్యర్థులు 8, 9, 33, 36 వార్డులలో స్వతంత్ర అభ్యర్దులుగా గెలుపు జెండా ఎగరేశారు. చివరికి వైసీపీ నుంచి కూడా రెబల్ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగించింది. 1, 18 వార్డులలో వైసీపీ రెబల్ అభ్యర్థులు గెలుపొంది ఔరా అనిపించుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చేమటలు పట్టించిన రెబల్ అభ్యర్థుల గురించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చ జరుగుతుంది.
రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. ఏదో ఒక పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వారున్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారు. ఎక్కడో ఒక చోట రెబల్ అభ్యర్థులు గెలిచినప్పటికి వారు ఫలితాలు వెలువడిన మరుక్షణమే సొంత పార్టీ గుమ్మం ముందు ప్రత్యక్షం అయ్యారు. పాత పార్టీ జెండాకే జై కొట్టారు. కానీ పిఠాపురంలో టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు రెబల్ గా దిగడమే కాకుండా గెలుపు సాధించడం రికార్డ్ అనే చెప్పాలి.
This post was last modified on November 5, 2026 7:40 am
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…
ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి…
ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…
మావిగన్.. (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలతో కూడిన రాజధాని) జగన్ చేసిన ఈ ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందే!. దీనినే తమ…