ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది అగ్ర కథానాయకులకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు లెజెండరీ నటి జయసుధ. అలాంటి నటి ఇప్పుడు సీనియర్ నిర్మాత అల్లు అరవింద్‌కు జోడీగా నటించాలని ఆశపడుతుండడం విశేషం. ఈ విషయాన్ని ఒక స్టేజ్ మీద చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సహజ నటి.
జయసుధ తాజాగా ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జయసుధ హాజరు కాగా.. అల్లు అరవింద్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అరవింద్‌ను ఉద్దేశించి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ నిర్మాతగా ఫేమస్ అయ్యారు కానీ.. ఆయన సూపర్ యాక్టర్ అనే సంగతి ఈ తరానికి తెలియదని, ఆయన చాలా బాగా నటిస్తారని జయసుధ అన్నారు. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఎప్పుడో చెప్పానని, కుదరలేదని.. కానీ ఇప్పుడు చేద్దామని అరవింద్‌ను ఉద్దేశించి చెప్పారు. ఈ సినిమాకు ‘రోమన్ హాలిడే’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని కూడా జయసుధ అన్నారు. ఈ మాటకు అరవింద్ నవ్వుతూ, సరే అన్నట్లు తల ఊపారు.
అరవింద్‌కు సన్నిహితుడైన యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాను నిర్మించాడు. శ్రీకర్ నయన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో ఫేమస్ అయిన కుర్రాడు రోహన్.. ‘35: చిన్న కథ కాదు’ చిత్రంతో మంచి పేరు సంపాదించిన అరుణ్ దేవ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జయసుధ.. అరుణ్ దేవ్ అమ్మమ్మ పాత్ర చేసింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates