పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి, ఖుషి, బాలు లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్‌గా, సూపర్ స్మార్ట్‌గా కనిపించాడు అంటే.. అప్పటి యూత్‌కు స్టైల్ ఐకాన్‌గా మారాడు అంటే.. అందులో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పాత్ర కీలకం. ఆ సినిమాలన్నింటికీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది రేణునే. ‘బద్రి’ చేస్తున్నపుడే పవన్‌తో ప్రేమలో పడిపోయిన ఆమె.. ఆయన సినిమాల మేకింగ్‌లో కీలకంగా ఉండేది. ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా తనే చూసుకునేది.
తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో అప్పటి అనుభవాల గురించి రేణు మాట్లాడింది. పవన్ సినిమాల్లో వాడే కాస్ట్యూమ్స్ కోసం విదేశాలకు కూడా వెళ్లి షాపింగ్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.
20 ఏళ్ల ముందు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ సినిమా కాస్ట్యూమ్స్ కోసం తాను లండన్‌కు వెళ్లేదాన్నని.. అక్కడికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా వచ్చేవాడని రేణు దేశాయ్ తెలిపింది. అక్కడి భారీ షాపింగ్ మాల్‌లో తాము ఇద్దరమే ఉండేవాళ్లమని.. తాను పవన్ బట్టల కోసం అక్కడికి కోసం వస్తే, షారుఖ్ కాన్ కాస్ట్యూమ్స్ కోసం కరణ్ వచ్చేవాడని రేణు వెల్లడించింది. కరణ్ జోహార్ పెద్ద దర్శకుడు అయినా, షారుఖ్ ఖాన్ కోసం ఆయన బట్టలు కొనాల్సిన అవసరం లేకపోయినా.. ప్రేమతో, సినిమా కోసం అలా చేసేవాడని రేణు చెప్పింది.
మరోవైపు అప్పట్లో సంచలనం రేపిన ‘బాలు’ సినిమా ప్యాంట్స్ గురించి కూడా రేణు మాట్లాడింది. ఆ ప్యాంటును కూడా ఇటలీలోని మిలాన్ నుంచి తెప్పించినట్లు రేణు వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి క్లాత్‌తో కేవలం ఐదు ప్యాంట్లు మాత్రమే తయారు చేస్తే.. అందులో ఒకటి పవన్ కోసం తీసుకున్నట్లు రేణు తెలిపింది.
ఆ ప్యాంట్ కోసం అప్పట్లోనే రూ.75 వేలు ఖర్చు పెట్టామని, అంత బడ్జెట్ ఎందుకనే చర్చ వస్తే.. పవన్ ఐదు వేల రూపాయల ప్యాంట్లు పది వేసుకోవడం కంటే, ఈ ఒక్క స్పెషల్ ప్యాంటు మీద ఆ రేటు పెట్టడం కరెక్టే అని నిర్మాతను ఒప్పించినట్లు రేణు తెలిపింది. అప్పట్లో ఆ ప్యాంట్స్ చర్చనీయాంశం అయ్యాయని.. ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అప్పుడు అంత బడ్జెట్ పెట్టడంలో తప్పు లేదని ఆమె అభిప్రాయపడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates