తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను సంచలనం రేపింది. ఆ సినిమా ఫ్లాపే కానీ.. అందులో శింబు, నయన్ కలిసి చేసిన ఇంటిమేట్ సీన్ల మీద పెద్ద చర్చే జరిగింది. అంతకంటే ముందు నయనతారతో శింబు లిప్ లాక్‌కు సంబంధించిన పోస్టర్లు దుమారం రేపి సినిమాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగే పరిస్థితి వచ్చింది.
దీనికి తోడు శింబు, నయన్‌ల వ్యక్తిగత బంధం గురించి కూడా అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. కట్ చేస్తే.. ఈ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత శింబు, నయన్ విడిపోయారు. తర్వాత చాలా ఏళ్లకు ఇద్దరూ ‘ఇదు నమ్మ ఆలు’ అనే సినిమా చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. మళ్లీ ఇద్దరూ కలిసి నటించింది లేదు. సాధారణంగా బ్రేకప్ అయిన వ్యక్తితో మళ్లీ కలిసి నటించడానికి ఆర్టిస్టుల ఇష్టపడరు. కానీ శింబు, నయన్ మాత్రం అప్పుడు జంట కట్టారు.
ఐతే అప్పుడంటే నయన్ సింగిలే. కానీ ఇప్పుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి కూడా అయింది. ఇలాంటి టైంలో శింబుతో కలిసి నటించడం అన్నది ఊహకందని విషయం. కానీ వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘డ్యూడ్’ సినిమాతో అరంగేట్రంలోనే పెద్ద హిట్ కొట్టిన కీర్తీశ్వరన్.. శింబు, నయన్ కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. శింబు అయితే ఈ సినిమాకు ఓకే అన్నాడు కానీ.. నయన్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
నయన్ కనుక ఈ సినిమాకు ఓకే చెబితే.. ఇదొక సెన్సేషనల్ ప్రాజెక్టు అవుతుందనడంలో సందేహం లేదు. వీళ్లిద్దరినీ మళ్లీ తెరపై చూడడానికి ప్రేక్షకులు అమితాసక్తిని ప్రదర్శించే అవకాశముంది. మరోవైపు కీర్తీశ్వరన్.. తమిళనాడు సీఎం కొడుకు జేసన్ సంజయ్‌తోనూ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. ఐతే ఆ ప్రాజెక్టుకు టైం పడుతుంది. అంతకంటే ముందే శింబు, నయన్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఐతే నయన్ నిర్ణయాన్ని బట్టే ఈ సెన్సేషనల్ జోడీని మళ్లీ తెరపై చూస్తామా లేదా అన్నది ఆధారపడి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates