ఏడాదికి రెండు సినిమాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఆదిపురుష్ నుంచి కష్టపడుతున్న ప్రభాస్ పని విషయంలో వెనక్కు తగ్గడం లేదు కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాడు. జనవరిలో ది రాజా సాబ్ చేసిన గాయం డిసెంబర్ లో ఫౌజీ పోగొడుతుందని భావిస్తే దాని పోస్ట్ పోన్ కాస్తా ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లేసింది. మార్చికి వెళ్ళిపోయి షాక్ ఇచ్చింది. ఒకవేళ అక్టోబర్ లో కనక స్పిరిట్ వస్తే 2027లో అభిమానులకు డార్లింగ్ డబుల్ బొనాంజా ఇచ్చినట్టు అవుతుంది.
ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న కల్కి 2 ఎప్పుడు రిలీజవుతుందనేది ఇప్పుడేం చెప్పలేం. దర్శకుడు నాగ్ అశ్విన్ వేగంగానే చేస్తున్నారు కానీ ఎంత టైం పడుతుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. సలార్ 2 ఉంటుందని హోంబాలే ఫిలిమ్స్ సందర్భం వచ్చినప్పుడంతా సోషల్ మీడియాలో చెబుతోంది కానీ ఎలాంటి సాలిడ్ అప్డేట్ లేదు. దీని తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ ఒక కమిట్ మెంట్ పెండింగ్ ఉంది. ఇప్పుడది నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ బ్యానర్ లో మిరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రస్తుతం మిరాయ్ 2 మీద పని చేస్తున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమేనేనికి ప్రభాస్ దాదాపు ఓకే చెప్పాడని టాక్. ఫైనల్ నెరేషన్ అయ్యాక ప్రకటన ఇచ్చేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. మరో ఇద్దరు దర్శకులు కూడా కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట కానీ వర్కౌటయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఒకరకంగా చెప్పాలంటే కార్తీక్ లాంటి వాళ్ళతో పని చేయడం ప్రభాస్ తీసుకునే తెలివైన డెసిషన్ అవుతుంది.
ఇవన్నీ తేలాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే. ముందైతే ఫౌజీ, స్పిరిట్ ల పనులు చూడాలి. ప్రభాస్ ఇంత సహకరిస్తున్నా ఎందుకు జాప్యం అవుతున్నాయనే ప్రశ్నకు అంత తేలిగ్గా సమాధానం దొరికేలా లేదు. విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు షూటింగ్ షెడ్యూల్స్ అప్పుడప్పుడు హఠాత్తుగా మారిపోవడం ప్రభావం చూపిస్తున్నాయి. ఏది ఏమైనా బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి విజయం కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల నిరీక్షణ వచ్చే ఏడాది ఫలించేలా ఉంది.
This post was last modified on November 1, 2026 10:00 am
నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ…
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి.. ఒమర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు. గత…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కారణాలు…
నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…
టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు భారీ రాజకీయ సెగ తగులుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం ఏడాది కూడా కాకుండానే..…