Political News

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఉందా

రాష్ట్రంలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పులివెందుల స‌హా రాష్ట్రంలోని మునిసిపాలిటీల‌లో అధికార పార్టీ నేత‌ల అరాచ‌కం య‌ధేచ్ఛ‌గా సాగుతోంద‌ని ఆరోపించారు. పులివెందుల‌లో కేవ‌లం 7 వార్డుల్లోనే వైసీపీ పోలింగ్ ఏజెంట్ల‌ను అనుమ‌తించార‌ని.. మిగిలిన వార్డుల్లో వైసీపీ ఏజెంట్ల‌ను త‌రిమేశార‌ని.. ఇదేం ప్ర‌జాస్వామ్య‌మ‌ని.. ఇదేనా పోలింగ్ నిర్వ‌హించే తీరు అని మండిప‌డ్డారు.

ఆదివారం ఉద‌యం తాడేప‌ల్లి నుంచి పులివెందుల‌కు చేరుకున్న జ‌గ‌న్‌.. తొలుత మీడియాతో మాట్లాడారు. తాను వ‌స్తుండ‌గా .. త‌న హెలికాప్ట‌ర్‌ను కూడా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. అతిక‌ష్టం మీద త‌న‌ను అనుమ‌తించార‌ని.. ఇదేనా ప్ర‌జా పాల‌న అని ప్ర‌శ్నించారు. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ నాయ‌కుల‌ను అడ్డుకుని టీడీపీ నేత‌లు ఓటర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎక్క‌డా ఏ పోలింగ్ బూతులోనూ సీసీ టీవీ కెమెరాల‌ను పెట్ట‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల‌ను, ఉత్త‌ర్వుల‌ను కూడా ఇక్క‌డ పాటించ‌డం లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. దీనిపై మ‌రోసారి తాము సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌భుత్వం స‌రిగా పాలించి ఉంటే.. ఇంత‌గా భ‌య‌ప‌డేది కాద‌ని అన్నారు. భ‌య‌ప‌డుతున్నారు కాబ‌ట్టే.. వైసీపీ నేత‌ల‌ను అడ్డుకుని పోలింగ్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎక్క‌డా ఓటు వేయ‌డం లేద‌ని.. వారి ఓట్ల‌ను కూడా టీడీపీ నాయ‌కులే వేస్తున్నార‌ని ఆరోపించారు పులివెందుల‌లో తెల్ల‌వారు జామున 4 గంట‌ల నుంచే పోలింగ్ బూత్‌ల‌ను క్యాప్చ‌ర్ చేశార‌ని అన్నారు.

ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలి..

ఈ సందర్భంగా జ‌గ‌న్ .. ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇలాంటి ప‌రిస్థితిలో జ‌రుగుతున్న ఈ పోలింగ్‌ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దు? అని నిల‌దీశారు. పోలింగ్‌ను ర‌ద్దు చేసి.. తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌జాస్వామ్యం లేకుండా.. నియంతృత్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. త‌మ చైర్ ప‌ర్స‌న్ అభ్య‌ర్థి వైఎస్ ప్ర‌మీల‌పైనా దాడి చేశార‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు.

This post was last modified on November 1, 2026 2:53 pm

Share

Recent Posts

జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో…

4 minutes ago

తొలి ఓటు బాల‌య్య‌తోనే

ఏపీలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అంతేకాదు.. యువ‌త స‌హా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి…

13 minutes ago

అక్టోబర్ రిపోర్ట్… కిక్కు సరిపోలేదు

విజయదశమి పండగ వచ్చే కీలకమైన అక్టోబర్ నెల అయిపోయింది. టాలీవుడ్ బాక్సాఫిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీజన్ మిశ్రమ…

2 hours ago

ప్రభాస్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి

ఏడాదికి రెండు సినిమాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఆదిపురుష్ నుంచి కష్టపడుతున్న ప్రభాస్ పని విషయంలో వెనక్కు తగ్గడం లేదు కానీ,…

3 hours ago

ఏపీలో పోలింగ్ స్టార్ట్‌.. ఒక విషాదం.. మ‌రిన్ని విచిత్రాలు!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ఆదివారం ఉద‌యం ప్రశాంతంగా ప్రారంభ‌మైంది. అయితే.. ఒక విషాదం చోటు చేసుకోగా..…

4 hours ago

సీతారాముల మీద ఒత్తిడి పెరుగుతోందా

నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ…

4 hours ago