కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న టాక్ షో ‘మెగావర్స్’ వార్తలు సోషల్ మీడియా, మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫస్ట్ లుక్ రాకుండానే ఎవరి ఎపిసోడ్స్ పూర్తయ్యాయి, ఎవరితో నెక్స్ట్ ఉంటుందనే డీటెయిల్స్ కూడా బయటికి వదులుతున్నారు. బ్రహ్మానందం – సునీల్ – సత్యది ముందు అయిపోగా నిన్న కమల్ హాసన్ ది ఫినిష్ చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ జాయింట్ ఎపిపోడ్ ఉంటుందట. ఆ తర్వాత ప్రభాస్ – సందీప్ వంగాది చర్చల్లో ఉందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ చిరంజీవి నుంచి అభిమానులు ఆశిస్తున్న అప్డేట్స్ ఇవి కాదు. రెండు సినిమాలు నువ్వా నేనాని పండక్కు పోటీ పడుతున్నప్పుడు వాటిలో ఏది ముందు రిలీజవుతుందనే తీపి కబురు అడుగుతున్నారు. సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న కాకా ఇప్పటికైతే దానికే కట్టుబడి ఉంది. దర్శకుడు బాబీ కొల్లి దానికి అనుగుణంగానే చిత్రీకరణ చేస్తున్నాడు. ఇటు విశ్వంభర ఓటిటి డీల్ అయిపోయిందని, జనవరి థియేటర్ రిలీజ్ కు ప్రైమ్ వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారని ఆల్రెడీ టాక్ తిరుగుతోంది.
ఈ ఏడాదిలో మిగిలిన నెలలు కేవలం రెండే. విశ్వంభర, కాకాలో ఏది రిలీజ్ ఫిక్స్ అయినా ముందు ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఎందుకంటే డిసెంబర్ లేదా అంతకన్నా ముందే మెగావర్స్ స్ట్రీమింగ్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఓ రేంజ్ లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తోందట. కొద్దిరోజులు ఆ హడావిడి ఎలాగూ ఉంటుంది. ఈలోగా చిరు తుది నిర్ణయం తీసుకుంటే ఏ సినిమాకు ప్రచారాలు మొదలుపెట్టాలనే దాన్ని బట్టి నిర్మాణ సంస్థలు మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
దశాబ్దాల తర్వాత చిరంజీవి ఇలాంటి సందిగ్ద పరిస్థితిని చూస్తున్నారు. ఒకప్పుడు నెలకో రిలీజ్ చేసినా ఇబ్బంది వచ్చేది కాదు. కలెక్షన్లు కురిసేవి. కానీ ఇప్పుడలా లేదు. ట్రెండ్ మారిపోయింది. ఒకదానిమీద మరొకటి వేసుకునే సిచువేషన్ లేదు. ఆ మధ్య శ్రీవిష్ణు కేవలం వారం గ్యాప్ లో మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రిలీజ్ చేస్తే రెండూ పోయాయి. మెగాస్టార్ కు అంత రిస్క్ ఉండకపోయినా తక్కువ నిడివి వల్ల ఎవరో ఒక ప్రొడ్యూసర్ అయితే రిస్క్ లో పడతారు. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on October 30, 2026 5:01 pm
ఇవాళ విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రాధమిక స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గుల మీద కొన్ని…
దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు. ఇంత సీరియస్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావడం లేదా? లేక..…
2027 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ వాటిలో అత్యధిక అంచనాలున్నది వారణాసి మీదే…
తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…
పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…