Political News

పులివెందుల ఎన్నికల్లో హింసకు స్కెచ్?

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఒకవేళ కిందిస్థాయి నేతలో, కార్యకర్తలో ఆవేశపడి హింసకు దిగుతామని అంటే వారిని వారించాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతపైనే ఉంటుంది. కానీ, వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇందుకు మినహాయింపు. కార్యకర్తలకు శాంతి సందేశం ఇవ్వాల్సిన జగన్… ఎవరొచ్చినా సరే స్లీవ్ మడతపెట్టండి అంటూ పిలుపునిచ్చిన వైనం షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే.

మీకెందుకు తిరగబడండి..మీ అన్న మీకు తోడుగా ఉంటాడు…ఇక్కడ చెంపదెబ్బ కొడితే రాష్ట్రం అంతా గూబ గుయ్ మని సౌండ్ వినిపించాలి అంటూ కార్యకర్తలను జగన్ కోరారు. ఇక, చొక్కా స్లీవ్ మడత పెట్టి మరీ రెడీగా ఉన్నానని, ఎంతమంది వస్తారో రండి అంటూ బాలయ్య బాబు ఫ్యాన్ అయిన జగన్ సమరసింహారెడ్డి రేంజ్ లో డైలాగ్ చెప్పి కార్యకర్తలను రంగంలోకి దిగాలని ప్రేరేపించిన వైనంపై విమర్శలు వచ్చాయి.

మరి, జగన్ ఈ రేంజ్ లో పిలుపునిస్తే కార్యకర్తలు ఊరుకుంటారా? అందుకే, జగన్ ఇలాకాలో ఆయనతో కలిసి హింసకు వైసీపీ నేతలు పక్కా వ్యూహరచన చేసినట్లు ఆరోపిస్తోంది టీడీపీ. మున్సిపల్ ఎన్నికలలో అల్లర్లు సృష్టించేందుకు..అలజడులు రేపేందుకు స్వయంగా జగన్ రంగంలోకి దిగారని… రేపు పులివెందులలో అల్లర్లు జరిగే అవకాశముందంటూ తన అనుకూల మీడియాలో వైసీపీ నేతలు కథనాలు నడిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఏకగ్రీవాలు జరిగిన చోట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పడంతో మాజీ ఎమ్మెల్యేలు ఈ రకంగా అలజడులకు ప్లాన్ వేశారని… తన సొంత గడ్డ అయిన పులివెందులలో మెజారిటీ స్థానాలు కూటమి ఏకగ్రీవం చేసుకోవడం జగన్ కు మింగుడు పడలేకపోవడం, ఆ లెక్కన జగన్ కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకోకూడదు కదా అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇలా తన అడ్డాలో 48 ఏళ్ల అరాచకానికి తెరపడిందన్న అవమాన భారాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారంటు తెలుగు తమ్ముళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సాదాసీదాగా జరిగితే ఓటమి ఖాయమని ఫిక్స్ అయిన జగన్ ఇలా హింసాత్మక ఘటనలకు పాల్పడి సింపతీ కొట్టేయాలని చూస్తున్నారనీ.. హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎన్నికలు అడ్డుకునేందుకు విఫలయత్నం చేసిన జగన్.. ఇక ప్రజా కోర్టులో కూడా చుక్కెదురవుతుందని గ్రహించారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అందుకే, పులివెందులలో అల్లర్లు సృష్టించేందుకు పొరుగు ప్రాంతాల నుంచి వైసీపీ రౌడీలను, గూండాలను వైసీపీ రంగంలోకి దించినట్లు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు సంచలన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 65 ఎంపీటీసీలకు గాను 64 స్థానాలు, 7 జెడ్పీటీసీలకు గాను 3 స్థానాలు, మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 20 వార్డులు కూటమి పార్టీలు కైవసం చేసుకోవడం చూసి జగన్ షాకయ్యారు. అందుకే, పోయిన పరువు కాపాడుకోవడానికి హింసే మార్గమని జగన్ డిసైడ్ అయ్యారని… అందుకే, తన సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డికి రప్పా రప్పా బ్యాచ్ ను మానిటర్ చేసే బాధ్యతలు అప్పగించినట్లు కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on October 30, 2026 6:12 pm

Share

Recent Posts

చిరంజీవి చెప్పాల్సిన అసలు ముచ్చట

కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న టాక్ షో 'మెగావర్స్' వార్తలు సోషల్ మీడియా, మీడియాలో తెగ…

2 hours ago

ఎంత మంచి పని చేశావ్ మాలా

ఇవాళ విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రాధమిక స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గుల మీద కొన్ని…

4 hours ago

నయనతార మీద అంత నమ్మకమా

దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార…

5 hours ago

చంద్రబాబు ఏమైనా జోక్ చేస్తున్నారా?

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు. ఇంత సీరియ‌స్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావ‌డం లేదా? లేక‌..…

7 hours ago

వార‌ణాసి ఆ డేట్‌కే వ‌స్తుందా అండీ?

2027 సంవ‌త్స‌రంలో ఇండియ‌న్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. కానీ వాటిలో అత్య‌ధిక అంచ‌నాలున్న‌ది వార‌ణాసి మీదే…

8 hours ago

కొన్ని రోజులు పుల్లారెడ్డి స్వీట్లను మర్చిపోండి

తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…

8 hours ago