Political News

సీఎం చంద్ర‌బాబుపై కేసులు… హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ హ‌యాంలో ప‌లు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. లిక్క‌ర్ విక్ర‌యాలు స‌హా ఇసుక, గ‌నులు, ఫైబ‌ర్ గ్రిడ్ ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబుపై కేసులు పెట్టారు. వీటిలో ఫైబ‌ర్ గ్రిడ్ కేసులో ఏకంగా 53 రోజుల పాటు బాబు రాజ‌మండ్రి జైల్లో ఉండి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం.. ఆయా కేసుల‌ను విచారించిన సీఐడీ, ఏసీబీ అధికారులు చంద్ర‌బాబు పాత్ర‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం తెలిసిందే.

దీంతో ఏసీబీ కోర్టు చంద్ర‌బాబుపై దాఖ‌లైన‌ దాదాపు అన్ని కేసుల‌ను మూసివేసింది. అయితే.. ఈ కేసుల మూసివేత‌, దానికి సంబంధించి తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌భుత్వం, అధికారులు చేసిన విచార‌ణ తాలూకు నివేదిక‌ల‌ను బ‌య‌ట‌కు ఇవ్వాల‌న్న వైసీపీ త‌ర‌ఫు న్యాయ‌వాదికి.. ఏసీబీ కోర్టు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇవ‌న్నీ అప్ర‌స్తుత‌మ‌ని ఏడాది కింద‌టే తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ స‌హా.. ప‌లువురు సామాజిక ఉద్య‌మ కారులు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. చంద్ర‌బాబుపై ఏసీబీ కోర్టు మూసివేసిన కేసుల వివ‌రాలు, ఏయే ఆధారాల‌తో వాటిని మూసి వేశారో ఆ మేర‌కు నివేదిక‌ల‌ను కూడా బ‌హిరంగ ప‌ర‌చాల‌ని కోరారు.

సుమారు ఆరు మాసాలుగా ఈ కేసును విచారించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం.. తాజాగా గురువారం ఉద‌యం తీర్పు వెలువ‌రించింది. చంద్ర‌బాబుపై న‌మోదైన కేసులు, ఏసీబీ కోర్టుకు అధికారులు స‌మ‌ర్పించిన నివేదిక‌లు, ఏయే ఆధారాల‌తో కేసులను మూసివేయాల్సివ‌చ్చిందో.. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటో అన్ని వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌ర‌చాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అంతేకాదు.. వీటిని స‌ర్టిఫై చేసి మ‌రీ కోరిన వారికి ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగం స‌హా.. గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుస‌రించాల‌ని ఏసీబీ కోర్టుకు సూచించింది.

క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లోని రూల్ 212(ఏ) సవరణను హైకోర్టు పేర్కంటూ.. ఏ కేసు విచార‌ణ‌లో అయినా.. థ‌ర్డ్ పార్టీ(కేసుతో సంబంధం లేనివారు కూడా) కోరితే స‌ద‌రు వివ‌రాల‌ను అందించాల్సిన బాధ్య‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఉంటుంద‌ని, లేక‌పోతే వేరే సంకేతాలు వెళ్తాయ‌ని పేర్కొంది. కాపీల‌ను తీసుకునే హ‌క్కు ఎవ‌రికైనా ఉంటుంద‌ని పేర్కొంది.

కోర్టులు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో పారద‌ర్శ‌కంగా ఉండాల‌ని పేర్కొంది. గోప్య‌త పాటించాల్సిన అవ‌స‌రం ఈ కేసులో లేద‌ని, కేవ‌లం పోక్సో, అత్యాచారం, గృహ హింస‌, దేశ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ, మ‌హిళ‌లకు సంబంధించిన వ్య‌క్తిగ‌త కేసుల విష‌యంలో మాత్ర‌మే గోప్య‌త పాటించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. చంద్ర‌బాబుపై కేసుల మూసివేత వివ‌రాలు కోరుకునే వారు సంబంధిత నిబంధ‌న‌లు పాటిస్తూ.. ఏసీబీ కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 

This post was last modified on November 19, 2026 2:27 pm

Share

Recent Posts

హమ్మయ్య… తుఫాన్ ముప్పు తప్పినట్టేనా?

నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…

25 minutes ago

ఇన్సూరెన్స్ లేకుండా టోల్ దాటే ముందు జర భద్రం

టోల్ ప్లాజా దాటితే చాలు.. మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు టోల్ చెల్లింపులకే పరిమితమైన…

1 hour ago

మోదీ నోట ‘సేవింగ్స్’ మంత్రం

ఈ మధ్యకాలంలో భారతీయులపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా ఎక్కువైంది. విలాసవంతమైన జీవితం, మద్యపానం, ఖరీదైన భోజనం వంటి వాటిని…

2 hours ago

స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓడించిన…

2 hours ago

యువత సపోర్ట్ చేస్తున్న కొత్త నగరం

నిన్న రాత్రి ప్రీమియర్లతో ఈ నగరానికి ఏమైంది రిపీట్ విడుదలయ్యింది. ముఖ్యంగా ఒక్క రాత్రిలో హైదరాబాద్ నుంచి కోటి రూపాయల…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే అంతకంటే అవమానం లేదు

స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూటమి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ఊపు…

2 hours ago