ఇవాళ విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రాధమిక స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గుల మీద కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ వెంకటేష్ ఫ్యాన్స్ భయపడినంతగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లేదని అర్థమైపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ట్విస్టు, వెంకీ శ్రీనిధి శెట్టి జంట మీద నడిపించిన కామెడీ జనాలు ఫ్రెష్ గా ఫీలవుతున్నారు. అయితే రిలీజ్ కు ముందు తమన్ కంపోజ్ చేసిన ‘మాలా తెచ్చా పాలు’ పాట మీద నెగటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
ట్విస్ట్ ఏంటంటే సినిమాలో అసలీ పాటే లేదు. ఎడిటింగ్ లో తీసేశారు. నిజం చెప్పాలంటే ఎక్కడా ప్లేస్ మెంట్ కి ఛాన్స్ లేదు. ఒకవేళ పెట్టాలన్నా బలవంతంగా ఇరికించాలి తప్పించి వేరే మార్గం లేదు. సందర్భం ఉన్నప్పటికీ ఆడియన్స్ దాన్ని ఫోర్స్డ్ గా ఫీలయ్యేవాళ్ళు. రెండున్నర గంటల నిడివికి కట్టుబడటం ద్వారా తెలివైన నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా మాలాని వద్దనుకోవడం మంచిదే. కాకపోతే షూట్ చేయడానికి పెట్టిన ఖర్చు వృథా అయ్యింది.
ఒకవేళ ఒక వారం అయ్యాక అదనపు ఆకర్షణ పేరుతో జోడించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. గతంలో దేవర లాంటి వాటికి ఇలాగే చేశారు కాబట్టి నెక్స్ట్ వీక్ మాలా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒక చిన్న కుటుంబం చుట్టూ కామెడీ, ఎమోషన్స్ జోడించి దానికి క్రైమ్ ఎలిమెంట్ తగిలించిన త్రివిక్రమ్ ఈసారి కొంచెం రూట్ అయితే మార్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ తరహాలో డార్క్ కామెడీ ట్రై చేశారు. కొన్ని చోట్ల బాగానే పేలింది కూడా. సాధారణ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
టాక్, రివ్యూల సంగతి పక్కనపెడితే ఈ వారం ఫస్ట్ ఛాయస్ ఆదర్శ కుటుంబం అవుతుందని చెప్పడం డౌట్ అక్కర్లేదు. బుకింగ్స్ కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒకవేళ దసరాకి వచ్చి ఉంటే పది రోజుల అడ్వాంటేజ్ తో పాటు మెరుగైన వసూళ్లు వచ్చేవని వెంకటేష్ ఫ్యాన్స్ ఫీలవ్వడంలో న్యాయముంది. అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో రణబాలి, జైలర్ 2కి దారి ఇచ్చేశారు. ఆదర్శ కుటుంబం తర్వాత కేవలం రెండున్నర నెలల గ్యాప్ లో వెంకటేష్ మరో సినిమా జనవరి 12 విడుదలతో రాబోతున్న సంగతి తెలిసిందే
This post was last modified on October 30, 2026 2:19 pm
కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న టాక్ షో 'మెగావర్స్' వార్తలు సోషల్ మీడియా, మీడియాలో తెగ…
దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు. ఇంత సీరియస్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావడం లేదా? లేక..…
2027 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ వాటిలో అత్యధిక అంచనాలున్నది వారణాసి మీదే…
తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…
పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…