Movie News

వారణాసి షూటింగ్‌ స్టేటస్ ఏంటి?

రూ.4 వేల కోట్ల బడ్జెట్లో ‘రామాయణం’ రెండు భాగాలను నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు కానీ, ప్రేక్షకుల దృష్టిలో మాత్రం రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’నే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం. ఆ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు. ఇక ఈ సినిమా స్కేల్, కాన్వాస్ ఏ రేంజిలో ఉండబోతున్నాయో గత ఏడాది రిలీజ్ చేసిన షో రీలే ఉదాహరణ.
అది చూశాక ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మించి జక్కన్న వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తాడనే అంచనాలున్నాయి.

‘వారణాసి’ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే రాజమౌళి సినిమాలకు మేకింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమై, విడుదల వాయిదా పడడం మామూలే. మరి ‘వారణాసి’ విషయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రస్తుతానికి టీంకు సినిమాను వాయిదా వేసే ఆలోచనేమీ లేనట్లే కనిపిస్తోంది.

తాజాగా ‘వారణాసి’ షూటింగ్ స్టేటస్ ఏంటో రాజమౌళి వెల్లడించాడు. చిత్రీకరణ ఇంకో పది రోజులు మాత్రమే మిగిలున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్‌డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు పార్ట్‌కు సంబంధించిన షూట్ గత నెలలోనే పూర్తయింది. మిగతా చిత్రీకరణను ఈ నెలాఖరుకే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విడుదలకు ఐదు నెలల సమయం ఉంటుంది. వీఎఫెక్స్ కార్యక్రమాలు సమాంతరంగా నడుస్తుండగా.. ఇక డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలవుతాయి.

మరోవైపు ‘వారణాసి’ కథ గురించి జక్కన్న మాట్లాడుతూ.. గ్లింప్స్ చూస్తే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుందని, కానీ ఇందులో పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ కథ ఉంటుందని జక్కన్న తెలిపాడు. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు ఒక యువతి-యుకుకుడి మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని రాజమౌళి తెలిపాడు. ఈ సినిమా చేస్తున్నపుడు ఆరేడు కథలను కలిపి ఒకటిగా తీస్తున్నట్లు అనిపించిందని.. తమకు ఇదే అతి పెద్ద సవాలు అని జక్కన్న వ్యాఖ్యానించాడు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

This post was last modified on October 22, 2026 9:56 am

Share

Recent Posts

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

42 minutes ago

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…

3 hours ago

దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం

విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…

3 hours ago

కీల‌క స‌మ‌యంలో కాడి ప‌డేస్తున్నారు

ఏ రాజ‌కీయ పార్టీకైనా కూడా ఎన్నిక‌లే కీల‌కం. తమ స‌త్తా నిరూపించేందుకు.... త‌మ బ‌లం చాటుకునేందుకు ప్ర‌జల్లో త‌మ‌కు ఉన్న…

7 hours ago

స్థానిక నామినేషన్లలో డిష్యుం డిష్యుం

ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా…

10 hours ago

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…

15 hours ago