ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేశారు. ఐమాక్స్ తో సహా వివిధ ఫార్మాట్స్ లో ఈ విజువల్ గ్రాండియర్ కనువిందు చేయనుంది. అయితే మాములుగా ఇంత పెద్ద స్కేల్ లో రూపొందుతున్న సినిమాకు ఉండాల్సిన హైప్ కొంచెం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా మెల్లగా దీని మీద హైప్ వచ్చేలా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారని ముంబై టాక్.
ఇదిలా ఉండగా కెజిఎఫ్ తర్వాత చాలా సెలెక్టివ్ గా మారిపోయిన యష్ కేవలం రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు. వాటిలో మొదటిది టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. రెండోది రామాయణలో కేవలం విలన్ గానే కాకుండా సహనిర్మాతగా కూడా ఇందులో భాగం పంచుకున్నాడు. రావణుడికి ఎంత స్కోప్ ఉన్నా ప్రాథమికంగా అది నెగటివ్ క్యారెక్టరే. చివరికి రాముడి చేతిలో హతమయ్యే పాత్రే. మరి ఇంత జాగ్రత్తగా ఉన్న యష్ ఇదెందుకు చేస్తున్నాడనే ప్రశ్న తలెత్తడం సహజం.
దానికి మెల్లగా సమాధానం దొరుకుతోంది. నిన్న విడుదల చేసిన రావణ తాండవం వీడియో సాంగ్ చూస్తే యష్ కి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఇప్పటిదాకా రావణుడిలోని విభిన్న కోణాలను స్పృశించింది స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమే. సీతారామకళ్యాణం, భూకైలాస్ దానికి అత్యుత్తమ ఉదాహరణలు. తర్వాత ఎవరూ అలా చూపలేదు. ఆదిపురుష్ మరీ దారుణం. సైఫ్ అలీ ఖాన్ ని దర్శకుడు ఓం రౌత్ ప్రెజెంట్ చేసిన తీరు ఏకంగా ట్రోలింగ్ కి దారి తీసింది.
ఒకవేళ రామాయణలో స్క్రీన్ స్పేస్, ఇంపార్టెంన్స్ పరంగా రావణుడు హైలైట్ అయితే ఇబ్బంది తప్పదు. రన్బీర్ కపూర్ మీద ఫోకస్ తగ్గొచ్చు. దాని వల్ల బాలీవుడ్ సోషల్ మీడియాలో ఒక వర్గం పనిగట్టుకుని సౌత్ యాక్టర్స్ అయిన యష్, సాయిపల్లవిని టార్గెట్ చేసి అదే పనిగా డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కబీర్ సింగ్ టైంలో సందీప్ రెడ్డి వంగ దీన్ని చవి చూశాడు. ఇదంతా దర్శకుడు నితేష్ తివారికి ఒక సవాల్ లాంటిది. విజయవంతంగా ఎదురుకుని కంటెంట్ తో సమాధానమిస్తే అన్ని నోళ్లు మూతబడతాయి.
This post was last modified on October 21, 2026 10:27 am
సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…
స్థానిక ఎన్నికల సమరంలో ఇప్పటి వరకు జరిగింది 25 శాతం మాత్రమే!. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరే షన్లకు మాత్రమే ఎన్నికల…
విడాకుల కేసులను గరిష్ఠంగా ఏడాదిలో పరిష్కరించాలని.. సుప్రీంకోర్టు గతంలోనే దేశంలోని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…
నిన్న మొన్నటి వరకు తమకు కంచుకోటగా ఉందని భావించిన పుంగనూరు నియోజకవర్గం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ…
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఆయన తనయుడు మహేష్ బాబు మాత్రమే పెద్ద స్టార్ అయ్యాడు.…
తెలంగాణలో పాలపిట్టలను విక్రయించే వారికి సీపీ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాలపిట్టలను పట్టుకున్నా.. వాటిని బంధించినా చర్యలు తప్పవని…