Movie News

రజినీ అంటే పిచ్చి… స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే?

ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్ ఫ్యాన్స్‌ను సంపాదించుకునే స్టార్లు కొంతమందే ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ కోవకే చెందుతారు. ఆయన పేరు చెబితే ఊగిపోయే సెలబ్రెటీలు చాలామందే ఉన్నారు. దక్షిణాదిన అయితే రజినీకి ఉన్న ఫాలోయింగే వేరు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా తలైవాకు వీరాభిమానే.

అతడిది ఏ స్థాయి అభిమానం అంటే.. రజినీ సినిమా రిలీజైతే చాలు, ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లిపోతాడు. గతంలో అతను లండన్‌లో ఉండగా రజినీ సినిమా రిలీజైతే.. సహచర క్రికెటర్లను తీసుకుని వెళ్లే షో వేసేశాడు. ఇక రజినీ లేటెస్ట్ మూవీ ‘జైలర్-2’ రిలీజ్ టైంకి అతడికి ఖాళీ లేకపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.

ఐతే తర్వాత వెస్టిండీస్‌తో చివరి టీ20 కోసం బెంగళూరుకు వచ్చాడు సంజు. ఆ మ్యాచ్ వర్షం వల్ల మధ్యలో రద్దు కాగా.. తర్వాతి రోజు సంజు టీమ్ ఇండియా సహచరులతో పాటు తన సన్నిహితులను తీసుకుని థియేటర్‌కు వెళ్లిపోయాడు. తన మిత్రుల కోసం అతను మొత్తం స్క్రీన్ స్క్రీనే బుక్ చేయడం విశేషం. సంజుతో పాటు ఎంతమంది థియేటర్‌కు వెళ్లారో ఏమో కానీ.. వేరే వాళ్లకు అవకాశం లేకుండా మొత్తం స్క్రీన్ బుక్ చేశాడు.

సామాన్య జనం మధ్యకు క్రికెటర్లు వస్తే, షో చూడడం మాని ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వెంటపడతారు కాబట్టి.. ఆ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తలైవా సినిమా చూడాలన్న ఉద్దేశంతోనో ఏమో సంజు మొత్తం థియేటర్ బుక్ చేసేశాడు. రజినీ మీద తనకున్న అభిమానానికి కూడా ఇది నిదర్శనమే. ఇలా క్రికెట్‌తో పాటు బిజినెస్ ఫీల్డ్, ఇంకా అనేక రంగాల్లో వీరాభిమానులను సంపాదించుకుని, వారిని ఈ వయసులోనూ ఇలా అలరిస్తుండడం రజినీకే సాధ్యం.

This post was last modified on October 20, 2026 3:50 pm

Share

Recent Posts

టైగర్‌పై దాడి… విదేశాల్లో ఉద్యోగం!

రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…

55 minutes ago

తాగి పాట పాడిన లెజెండ‌రీ సింగ‌ర్?

ద‌లేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగ‌ర్. తుణుక్ తుణుక్ తున్.. స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్…

2 hours ago

యష్ ముందే చెప్పడం సరికాదేమో

నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…

2 hours ago

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి…

3 hours ago

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

4 hours ago

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

4 hours ago