రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల వేళ ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామంటూ అధికారులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్థావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. వైసీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు భయం నీడలో బతకాల్సి వస్తుందన్నారు.
అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఈ విషయాలను వివరించడం నా బాధ్యతని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మీరు వేసే ఓటు మాకు మరింత శక్తిని ఇస్తుందని, మరింత ఉత్సాహంగా పనిచేయడానికి బూస్ట్ ఇస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే ధ్యేయంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తుంటే.. దాన్ని అడ్డుకునేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశానికైనా, రాష్ట్రానికైనా ఈ 20 ఏళ్లూ చాలా ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కలిసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని, త్రిపులింజన్ వేగంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
వైసీపీ నేరస్థులను తయారుచేసే ఫ్యాక్టరీలా మారిందని, రప్పా రప్పా రాజకీయాలు చేస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఫ్యాక్షనిజం కారణంగా రాయలసీమ 70 ఏళ్లపాటు నష్టపోయింది. అభివృద్ధిలో వెనకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మదనపల్లికి అనంత్ అంబానీని తీసుకొచ్చి అభివృద్ధికి పునాదులు వేసామని తెలిపారు. రానున్న రెండేళ్లలో రాయలసీమ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
జెన్‌జీ అంటే జగన్ లాంటి అవినీతిపరులను మోయడానికే ఉన్నట్లు ఆయన భావిస్తున్నట్లుందని వ్యాఖ్యనించారు. యువతకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచనలు చేయకుండా వారిని పావులుగా వాడుకుని వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. క్రిమినల్స్‌తో కలిసి జెన్‌జీలు తమ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. జెన్ జీ జగన్ మాయలో పడేంత పిచ్చివాళ్ళు కాదన్నారు.
జగన్ బెంగళూరులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు సృష్టిసస్తున్నాడని, అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నాలుగు ఆరోపణలు చేసి వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. హింసను నమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పార్టీని స్థానిక ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రౌడీలు ఏ పార్టీ తరుపున పోటీ చేసినా ప్రోత్సాహించవద్దని సూచించారు.
This post was last modified on October 20, 2026 7:43 pm
ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…
రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…
దలేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగర్. తుణుక్ తుణుక్ తున్.. సహా ఎన్నో బ్లాక్ బస్టర్…
నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫలితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంది. రాబోయే 6 నుండి…
వైసీపీ తరఫున ముద్రగడ కుటుంబానికి దక్కుతున్న ఆదరణ ఎంత? పద్మనాభం మృతి చెందిన తర్వాత.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన…