రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద దుండగులు దాడి చేయడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ దాడి వెనుక ఉన్నది పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి చెందిన వాళ్లని కొన్ని గంటల్లోనే వెల్లడైంది.
బిష్ణోయ్ గ్యాంగే ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకుంది. బిష్ణోయ్ కొన్నేళ్ల నుంచి జైల్లోనే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి 700 మందితో కూడిన గ్యాంగ్‌ను నడిపిస్తున్నాడు. దేశ విదేశాల్లో వీరి మనుషులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టైగర్ మీద దాడికి సంబంధించి పెద్ద ఉద్దేశం ఏమీ లేదని.. బాలీవుడ్‌ను భయపెట్టి, దేశంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి తమ ఉనికిని చాటుకోవాలనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యమని అర్థమవుతోంది. టైగర్ మీద దాడి చేసింది ఎవరు.. వాళ్లకు ఏం చెప్పి ఈ ఎటాక్ చేయించారు.. తెర వెనుక ఏం జరిగింది అన్నది పోలీసులు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హ్యాండ్లర్లు.. బీహార్‌కు చెందిన రితిక్, హరియాణాకు చెందిన రేహాన్, పూల్ సింగ్ అనే ముగ్గురు యువకులను టైగర్ ష్రాఫ్ ఎటాక్ మిషన్ కోసం ఎంచుకున్నారు. ఈ ముగ్గురి మీద గొడవలు, స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించి.. సోషల్ మీడియా ద్వారా వీరిని లారెన్స్ గ్యాంగ్ సంప్రదించింది.
ముగ్గురికీ విదేశాల్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు డబ్బులు కూడా ఇస్తామని ఆశ చూపించి మిషన్లోకి దించారు. ముందుగా రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు.. అమెరికాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ ఈ ముగ్గురితో కొన్ని రోజుల పాటు సంప్రదింపులు జరిపాడు. వారం రోజుల పాటు ఈ ముగ్గురూ రెక్కీ జరిపి.. టైగర్ వీకెండ్లో ఫుట్ బాల్ ఆడడం కోసం జుహుకు వెళ్తారని గుర్తించారు.
ఈ మార్గ మధ్యంలోనే దాడికి ప్లాన్ చేశారు. మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు నిందితులు టైగర్ ష్రాఫ్ కారు మీద ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే సమయంలో ఒకరి తుపాకీ పని చేయకపోవడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులు నేపాల్‌కు పారిపోతుండగా.. రాజస్థాన్‌లోని కోటాలో ఆగి ఉన్న రైల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on October 20, 2026 3:46 pm
దలేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగర్. తుణుక్ తుణుక్ తున్.. సహా ఎన్నో బ్లాక్ బస్టర్…
నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫలితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంది. రాబోయే 6 నుండి…
వైసీపీ తరఫున ముద్రగడ కుటుంబానికి దక్కుతున్న ఆదరణ ఎంత? పద్మనాభం మృతి చెందిన తర్వాత.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన…
ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…
పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…