దలేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగర్. తుణుక్ తుణుక్ తున్.. సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో ఆయన దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. తెలుగులో కూడా రబ్బరు గాజులు రబ్బరు గాజులు (యమదొంగ) సహా కొన్ని పాటలు పాడారాయన. ఈ మధ్య ఆయన ఊపు కొంచెం తగ్గింది. సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.
అయినప్పటికీ ప్రైవేటు షోలలో పాడుకుంటూ తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇలాంటి దిగ్గజ గాయకుడికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. మద్యం తాగి పెర్ఫామెన్స్ ఇస్తున్నాడంటూ దలేర్ మీద స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పెర్ఫామెన్స్ ఆపించి స్టేజ్ మీది నుంచి కిందికి దించేశారు. ఈ ఉదంతం ఉత్తరాఖండ్‌లోని నరేంద్రనగర్‌లో జరిగింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో పెర్ఫామెన్స్ కోసం దలేర్ మెహందీ వెళ్లారు. అయితే.. ఆయన వేదిక ఎక్కి పాటలు పాడుతుండగా ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శుభోద్ ఉనియల్ అడ్డు తగిలారు. నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో తాగి పాడుతావా అంటూ దలేర్ మీద ఆయన మండిపడ్డారు.
దలేర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే వినలేదు.
సరిగ్గా మాట్లాడలేకపోతున్నావ్, ఇక పాటలు ఏం పాడుతావ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న వ్యక్తులు ఎమ్మెల్యేను వారించే ప్రయత్నం చేసినా.. ఆయన కోపాన్ని ఆపుకోలేకపోయారు. దలేర్ ఎమ్మెల్యేను ప్రతిఘటించకపోవడం.. ఆయన హావభావాలు చూస్తే కొంచెం తేడాగానే అనిపించాయి. ఆయన మద్యం తాగి వచ్చింది నిజమే అన్న చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on October 20, 2026 3:04 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫలితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంది. రాబోయే 6 నుండి…
వైసీపీ తరఫున ముద్రగడ కుటుంబానికి దక్కుతున్న ఆదరణ ఎంత? పద్మనాభం మృతి చెందిన తర్వాత.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన…
ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…
పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వస్తున్న…