Movie News

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది మార్చి తొలి వారంలో విడుదల కావడం లేదు. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబరు 29న, దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సందీప్ తాజాగా ప్రకటించాడు. కచ్చితంగా వస్తుందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతానికి కూడా ‘రామాయణం-2’ రిలీజ్ డేట్ కూడా అదే. అంటే ఒక ఎపిక్ క్లాష్ చూడబోతున్నామన్నమాట.

ఆ సంగతి పక్కన పెడితే.. ‘స్పిరిట్’ సినిమా ఆలస్యం కావడం ప్రభాస్ అభిమానులతో పాటు సందీప్ ఫ్యాన్స్‌కు కూడా తీవ్ర నిరాశ కలిగించేదే. వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నా.. వాటిలో ఎక్కువ అంచనాలున్నది ‘స్పిరిట్’ మీదే అంటే అతిశయోక్తి కాదు. ఐతే మిగతా దర్శకుల్లా సమయానికి సినిమాను పూర్తి చేయలేక ఈ సినిమాను వాయిదా వేయలేదు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అవుతోంది. ప్రభాస్ ఇంకా కొంత కాలం ఆ సినిమా కోసం పని చేయాలి. అందుకు తగ్గట్లే ‘స్పిరిట్’ సినిమా కూడా ఆలస్యం అవుతోంది. ప్రభాస్ చెప్పినట్లుగా కాల్ షీట్స్ ఇస్తే సందీప్ తాను ప్లాన్ చేసుకున్నట్లే షూట్ పూర్తి చేసేవాడు. చెప్పినట్లే మార్చిలో సినిమాను రిలీజ్ చేసేవాడు. ప్రభాస్ అందుబాటులో రాకపోవడానికి తోడు ‘ఫౌజి’ని వేసవి ఆరంభంలో రిలీజ్ చేయడానికి దారి ఇవ్వాల్సిన పరిస్థితుల్లోనే సందీప్ తన సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అతడి పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చు.

అలాగే ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళానికి తావివ్వకుండా.. ముందు ఒక డేట్ ఇచ్చి మళ్లీ మార్చి అందరినీ ఇబ్బందిపెట్టడం లాంటివి చేయకుండా.. చాలా ముందుగానే విడుదల తేదీ మీద స్పష్టత ఇచ్చాడు. తనకు కావాల్సినంత టైం తీసుకుని సినిమాను అనుకున్నట్లుగా తీర్చదిద్దే పనిలో పడ్డాడు. ఈ విషయంలో సందీప్‌ను అభినందించాల్సిందే. ఇక తేలాల్సింది ‘ఫౌజి’ రిలీజ్ డేట్ ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది.

This post was last modified on October 19, 2026 12:02 am

Share

Recent Posts

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3…

3 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

3 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

4 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

4 hours ago

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…

4 hours ago

స్థానికంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లు మొదలయ్యాయా?

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కొన్ని…

4 hours ago