Political News

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి కూడా జిల్లాలోని మొత్తం 10 మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానాల్లో కేవ‌లం మూడు స్థానాల్లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌గ‌లిగారు. వైసీపీ నుంచి కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి, పులివెందులలో వైఎస్ ప్రమీలాదేవి(జ‌గ‌న్ బంధువు), ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి మాత్రమే బరిలో నిలిచారు.

ఏడు చోట్ల ఏక‌గ్రీవాలు..

ఉమ్మడి కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా కొన‌సాగ‌నుంది. పదింట ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవ‌కాశం ఉంద‌ని పార్టీ అంచ‌నా వేసింది. కీల‌క‌మైన ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం నియోజ కవర్గాల్లో టీడీపీ త‌ర‌ఫున దాఖ‌లు చేసిన నామినేష్లు ఏక‌గ్రీవం కానున్నాయి. ఫ‌లితంగా తెలుగుదేశం అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, వైసీపీ కేవ‌లం మూడు స్థానాల్లో పోటీలో ఉన్నా.. ఒక్క పులివెందుల మిన‌హా.. మిగిలిన‌ రెండుచోట్ల కూడా.. ఇబ్బందులు ప‌డుతోంది. పులివెందుల‌లో మాత్ర‌మే వైఎస్ ఫ్యామిలీ ఒకింత యాక్టివ్‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఎందుకిలా?

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌.. దాడులు.. ఏకంగా ఎస్పీ న‌చికేత్ విశ్వ‌నాథ్‌పైనే వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్లు రువ్విన నేప‌థ్యంలో పోలీసులు జిల్లాను అష్ట‌దిగ్భంధం చేశారు. దీంతో ఆదివారం నామినేష‌న్ల చివ‌రి రోజు నామినేష‌న్లు వేయాల‌ని అనుకున్న నాయ‌కులు మందీ మార్బ‌లం లేక‌పోవ‌డంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేక పోయారు. ఫ‌లితంగా జ‌గ‌న్ సొంత జిల్లాలోనే నాయ‌కులు నామినేష‌న్లు వేయ‌లేక పోయారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి స‌హా కీల‌క నాయ‌కుల‌కు పోలీసులు బీఎన్ ఎస్ చ‌ట్టంలోని 168 సెక్ష‌న్ కింద నోటీసులు ఇవ్వ‌డంతో మిగిలిన కార్య‌క‌ర్త‌లు కూడా బ‌య‌ట‌కు రాలేదు.

మ‌రోవైపు శ‌నివారం ఎస్పీ, డీఎస్పీపై దాడి స‌హా నామినేష‌న్ కేంద్రంపై జ‌రిగిన దాడిపై పోలీసులు నాలుగు కేసులు న‌మోదు చేశారు. 562 మందిపై కేసులు పెట్టారు. వీరిని గుర్తించి విచారించ‌నున్న‌ట్టు ఎస్పీ తెలిపారు. అలానే..ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌కు అనుగుణంగా కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఇది కూడా చివ‌రి రోజు నామినేష‌న్లు వేసే ఘ‌ట్టంపై ప్ర‌భావం చూప‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని తెలిసింది. మొత్తంగా జ‌గ‌న్ సొంత జిల్లాలోనే 7 స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఏక‌గ్రీవంగా మారుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 19, 2026 12:12 am

Share

Recent Posts

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…

3 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

4 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

5 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

5 hours ago

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…

5 hours ago

స్థానికంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లు మొదలయ్యాయా?

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కొన్ని…

5 hours ago