అనిరుధ్ రవిచందర్.. పేరుకు తమిళుడే కానీ, ఇప్పుడు ఇండియా మొత్తంలో అతను నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒప్పుకుని తీరాల్సిందే. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, తన సినిమాల్లో పాటలకు వచ్చే రీచ్.. తన బీజీఎంకు వచ్చే అప్రిషియేషన్ ఇంకెవరూ మ్యాచ్ చేయలేనిది. లేటెస్ట్‌గా ‘జైలర్-2’ సినిమాతో తనేంటో మరోసారి రుజువు చేశాడు. ‘3’ సినిమాతో మొదలుపెడితే.. అనిరుధ్ మ్యూజికల్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే.
కానీ తన వ్యక్తిగత జీవితం గురించి జనాలకు తెలిసింది కొంతే. అనిరుధ్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మేనల్లుడి వరస అవుతాడని చాలామందికి తెలియదు. ఐతే రజినీకి అనిరుధ్.. డైరెక్ట్‌గా మేనల్లుడు కాదు. అతను రజినీ భార్య లతకు మేనల్లుడు. లత సోదరుడైన రాఘవేంద్ర రవిచందర్.. అనిరుధ్‌కు తండ్రి. రాఘవేంద్ర రవిచందర్ తమిళంలో పేరున్న నటుడే. డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగు వాళ్లకూ పరిచయమే.
అనిరుధ్ తల్లి లక్ష్మి క్లాసికల్ డ్యాన్సర్. అనిరుధ్ ముత్తాత సుబ్రహ్మణ్యం తమిళ సినీ దర్శకుడు. అతడి తాత రామనన్ సంగీత దర్శకుడు. పద్మవిభూషణ్, డ్యాన్సర్ పద్మ సుబ్రహ్మణ్యంకు అనిరుధ్ మనవడవుతాడు. ఇలా అనిరుధ్ కుటుంబంలో అందరూ ఆర్ట్‌తో సంబంధం ఉన్న వాళ్లే.
సినిమాలు, సంగీతంతో ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ వల్ల అనిరుధ్ చిన్నపుడే సంగీతం వైపు అడుగులు వేశాడు. టీనేజీలోనే మ్యూజికల్ ఆల్బమ్స్, బ్యాండ్ పెర్ఫామెన్స్‌లు ఇచ్చి మంచి పేరు సంపాదించాడు. 22 ఏళ్లకే ధనుష్ మూవీ ‘3’తో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ‘కొలవరి’ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.
అనిరుధ్ కెరీర్ ఆరంభంలో నటి, సింగర్ ఆండ్రియాతో డేటింగ్ చేశాడు. వాళ్లిద్దరి లిప్ లాక్ ఫొటోలు అప్పట్లో సంచలనం రేపాయి. తర్వాత సింగర్ జోనిత గాంధీ, హీరోయిన్ కీర్తి సురేష్‌తో రిలేషన్‌షిప్ అంటూ రూమర్లు వచ్చాయి. ఇందులో కీర్తితో వ్యవహారం జస్ట్ రూమరే కావచ్చు కానీ.. జోనితతో మాత్రం కొన్నాళ్లు వ్యవహారం సీరియస్‌గానే నడిచిందనే అనుమానాలున్నాయి.
అనిరుధ్ పెళ్లి వార్త బయటికి రాగానే జోనిత ‘డ్యూడ్’ బ్రేకప్ సాంగ్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయడం చర్చనీయాంశం కావడం తెలిసిందే. అవన్నీ పక్కన పెడితే అతను వచ్చే నెల 11న సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్‌ను గ్రీస్‌లో పెళ్లాడబోతున్నాడు. అదే నెల 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
This post was last modified on October 19, 2026 12:05 am
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…
వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆదివారం మధ్యాహ్నం 3…
తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…
తెలంగాణలో దసరా వచ్చిందంటే.. ఎక్కడ చూసినా సందడే సందడి. బతుకమ్మ పాటలు, ఆటలతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వేరే ప్రాంతాల…
తాజాగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠాపై…
బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…