Movie News

రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకడే రౌడీ

విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య నిలబడి మైక్ అందుకున్నాడంటే డైనమైట్లు పేల్చేస్తాడు. కాకపోతే మధ్యలో వరుస ఫ్లాపులు రావడంతో తన దూకుడు కొంచెం తగ్గింది. తన కొత్త చిత్రం ‘రణబాలి’కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తున్న నేపథ్యంలో విజయ్‌లో మళ్లీ ఉత్సాహం వచ్చినట్లే ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పర్యటించిన విజయ్.. అక్కడ క్రేజీ కామెంట్లు చేశాడు.

గతంలో అన్న ‘తెలుగు రాష్ట్రాలకు ఒకడే రౌడీ’ అనే స్టేట్మెంట్‌ను మరోసారి వల్లెవేశాడు. ‘‘ఇంతకుముందు ఏదో ప్రి రిలీజ్ ఈవెంట్‌కో, సక్సెస్‌ మీట్‌కో వచ్చినపుడు ‘రెండు రాష్ట్రాలకు ఒకడే రౌడీ’ అని అని చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎప్పటికీ ఒకడే రౌడీ. మీ అందరి ప్రేమ చూస్తుంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు కావడం ఒక అదృష్టం, దేవుడి దయ అనిపిస్తుంది.

ఎందుకంటే మీలాంటి ప్రేక్షకులు, మీలాంటి ప్రజలు మాకు దొరుకుతారు. మీ కోసం సినిమా చేయడం, మీరు ఆ సినిమాను ప్రేమించడం, మేం ఆ ప్రేమను అందుకోవడం.. ఏం పుణ్యం చేసుకున్నామో? మాకు, మా ముందున్న వాళ్లకు, మా తర్వాత వచ్చే వాళ్లకు అందరికీ ఇది పెద్ద అదృష్టం’’ అని విజయ్ అన్నాడు.

‘రణబాలి’ సినిమా గురించి మాట్లాడుతూ.. దాన్ని హాలీవుడ్ క్లాసిక్ ‘బ్రేవ్ హార్ట్’తో పోల్చాడు విజయ్. ‘‘చిన్నపుడు మాకు ఇంగ్లిష్ సినిమాలు వేసి చూపించేవాళ్లు. బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలు చూసినపుడు.. మనం యాక్టర్ అయితే ఇలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. ‘రణబాలి’ మన చరిత్ర గురించి చెప్పిన సినిమా. ఇది మన మాస్ బ్రేవ్ హార్ట్’’ అని విజయ్ పేర్కొన్నాడు.

This post was last modified on October 18, 2026 2:03 pm

Share

Recent Posts

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…

3 hours ago

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3…

5 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

5 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

5 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

6 hours ago

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…

6 hours ago