Movie News

అనిరుధ్ పెళ్లి జోస్యం.. 100 శాతం నిజ‌మైందే

బహుశా అది ప‌దేళ్లు, అంత‌కంటే ముందు వీడియో కావ‌చ్చు. ఒక టీవీ షోలో పాల్గొన్నాడు సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్. త‌న ప‌క్క‌నే మాజీ హీరోయిన్ న‌మిత ఉంది. ఎదురుగా ఒక జ్యోతిషురాలు, త‌న ప‌క్క‌న ఒక ట్రాన్స్‌జెండ‌ర్ యాంక‌ర్ కూర్చున్నారు. అందులో అనిరుధ్ పెళ్లి గురించి చ‌ర్చ వ‌చ్చింది. అతడిది ప్రేమ వివాహ‌మా.. పెద్ద‌లు కుదిర్చే పెళ్లి అవుతుందా.. అమ్మాయి ఏ రంగానికి చెందిన‌ది కావ‌చ్చు.. త‌న‌ది ఏ ఊరు కావ‌చ్చు.. ఇలా యాంక‌ర్ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడుగుతుంటే జ్యోతిష్యురాలు జ‌వాబులు చెప్ప‌డం మొద‌లుపెట్టింది.

అనిరుధ్ ఎన్నో గ‌ర్ల్ ఫ్రెండ్ త‌న‌కు భార్య అవుతుంది అంటే.. జ్యోతిషురాలు స‌మాధానం చెప్ప‌లేదు కానీ.. అత‌ను ప్రేమించే పెళ్లి చేసుకుంటాడ‌ని, ఆ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రిస్తార‌ని అంది. అత‌ను సినీ రంగానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోడ‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. దీంతో అనిరుధ్ హ‌మ్మ‌య్య అన్న‌ట్లు సంకేతం ఇవ్వ‌గా, త‌న ప‌క్క‌నున్న న‌మిత‌.. అదేంటి హీరోయిన్లు అంటే చిన్న‌చూపా అంటూ సెటైర్ వేసింది.

ఇక అనిరుధ్ పెళ్లి చేసుకునే అమ్మాయి టెలీ క‌మ్యూనికేష‌న్ రంగానికి చెంది వ్య‌క్తి అని.. ఆమెది రాజ‌కీయల‌తో కూడా సంబంధం ఉన్న కుటుంబం అని ఆ జ్యోతిషురాలు చెప్పారు. అంతే కాక ఆ అమ్మాయి అనిరుధ్ ఉంటున్న సిటీలోనే ఉంటుంద‌ని.. త‌న ఇంటికి, ఆమె ఇంటికి ఒక‌ట్రెండు కిలోమీట‌ర్ల దూర‌మే ఉంటుంద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అనిరుధ్ ఇంకా కల‌వ‌లేద‌ని కూడా ఆమె చ‌ప్పింది.

సన్‌ టీవీ అధినేత కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయిన నేప‌థ్యంలో ఆ జ్యోతిష్యురాలు చెప్పిన విష‌యాల‌న్నీ పోలి ఉండ‌డంతో ఇంత ప‌ర్ఫెక్ట్‌గా ఎలా జోస్యం చెప్ప‌గ‌లిగిందో అని ఇప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అనిరుధ్, కావ్య పెళ్ళి నవంబరు 10న గ్రీస్‌లో పెళ్లి జరగనుండగా.. 21న చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

This post was last modified on October 18, 2026 11:22 am

Share

Recent Posts

టీడీపీ 11…జనసేన 21…భలేగుంది కదూ…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్లు అనగానే ఎవరికైనా సరే వైసీపీ గుర్తుకు రావడం ఖాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా…

5 hours ago

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

12 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

12 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

13 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

14 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

15 hours ago