Movie News

చిరుకు నో హీరోయిన్.. నో రొమాన్స్.. నో డ్యూయెట్

మన స్టార్ హీరోలకు ఎంత వయసు వచ్చినా సరే.. హీరోయిన్లతో రొమాన్సులు.. పాటలు.. డ్యాన్సులు ఉండాల్సిందే అనే అభిప్రాయం ఒకప్పుడు అటు ఇండస్ట్రీలో.. ఇటు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆ ఛట్రం నుంచి హీరోలు బయటికి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు అస్సలు ఊహకు కూడా అందని క్యారెక్టర్లు చేస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టినపుడు ‘ఖైదీ నంబర్ 150’లో పాత ఫార్ములానే అనుసరించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మార్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

‘గాడ్ ఫాదర్’లో ఆయనకు హీరోయిన్ లేదు. రొమాన్సూ లేదు. డ్యూయెట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘కాకా’లోనూ ఇదే స్టైల్ కొనసాగిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర రచయిత కోన వెంకట్ ధ్రువీకరించారు. ఈ సినిమా పూర్తిగా తండ్రి-కూతురు ఎమోషన్ నేపథ్యంలో నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో చిరు కూతురి పాత్రలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఇలాంటి కథల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ పెట్టి హీరోయిన్ పాత్రను జోడించడం.. ఒక డ్యూయెట్ పెట్టడం లాంటివి చేస్తుంటారు డైరెక్టర్లు. కానీ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరున్నప్పటికీ బాబీ కొల్లి అలా చేయట్లేదని.. కథను అనుసరించే వెళ్లబోతున్నాడని.. ఇందులో చిరుకు హీరోయిన్ ఉండదని.. రొమాన్స్, డ్యూయెట్లు లాంటివేమీ ఆశించవద్దని కోన తేల్చేశారు.

టీజర్లో చూపించినట్లు చిరు ఇంత హంబుల్‌గా, గ్రౌండెడ్‌గా ఉండే పాత్ర చేయడం అరుదని.. కాకపోతే ఈ పాత్రలో వేరే షేడ్స్ కూడా ఉంటాయని.. అదే ఈ సినిమాలో సర్ప్రైజ్ అని ఆయనన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అదే రైటింగ్ టీం చేస్తున్న సినిమా ఇదని.. అలాగే చిరు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తమకు పెద్ద టార్గెట్ పెట్టారని.. అందుకే భయ భక్తులతో జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నామని.. కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామని కోన ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on October 15, 2026 3:35 pm

Share

Recent Posts

జ‌న‌సేన ఎంట్రీతో వంగ‌వీటికి పూర్వ వైభ‌వం వ‌చ్చేనా!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రంగా కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రంగా జీవించి ఉన్న రోజుల్లో.. ఆయ‌న తూర్పు నియోజ‌క…

3 minutes ago

దేశం విడిచి వెళ్లిపో… అమీర్ ఖాన్ మేనల్లుడికి ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు…

1 hour ago

ముత్తువేల్ పాండియన్ మళ్ళీ మొదలెట్టాడా

ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి…

2 hours ago

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

5 hours ago

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…

5 hours ago

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…

7 hours ago