Political News

జ‌న‌సేన ఎంట్రీతో వంగ‌వీటికి పూర్వ వైభ‌వం వ‌చ్చేనా!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రంగా కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రంగా జీవించి ఉన్న రోజుల్లో.. ఆయ‌న తూర్పు నియోజ‌క వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న స‌తీమ‌ణి వంగ‌వీటి ర‌త్న‌కుమారి కూడా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, రంగా వార‌సుడిగా వ‌చ్చిన రాధాకృష్ణ‌.. మాత్రం 2004 ఎన్నిక‌ల త‌ర్వాత అది కూడా కాంగ్రెస్ హ‌వా, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నాటి ప‌రిస్థితిలో విజ‌యం సాధించారు. ఇక‌, 2009 నాటికి పార్టీ మారి.. ప్ర‌జారాజ్యంలోకి వ‌చ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి రాధాకృష్ణ అసెంబ్లీలోకి అడుగు పెట్టింది లేదు.

క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం రాధాకృష్ణ జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఇది రెండు ర‌కాలుగా రాధాకృష్ణ‌కు క‌లిసి వ‌చ్చే అంశంగా విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌టి సామాజిక వ‌ర్గం కాపుల ప‌రంగా.. జ‌న‌సేన‌కు ఎలానూ గుర్తింపు ఉంది. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో రంగా మిత్ర‌మండలి నుంచి అదేవిధంగా కాపుల నుంచి కూడా రాధాకృష్ణ‌కు మ‌రోసారి గుర్తింపు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అన్నింటికీ మించి… వ్య‌క్తిగ‌తంగా రాధా తీసుకునే నిర్ణ‌యాలు కూడా అనేక విమ‌ర్శ‌ల‌కు దారితీశాయి. తాను చెప్పింది జ‌ర‌గాల‌న్న ధోర‌ణి కార‌ణంగా.. రాధా గ‌తంలో కాంగ్రెస్‌, వైసీపీకి కూడా దూర‌మ‌య్యాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఎమ్మెల్యేగా ఉన్న రాధా విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ మ‌హిళా క‌మిష‌న‌ర్‌తో వివాదం పెట్టుకున్నారు. ఆమె కార్యాల‌యం ముందు కూర్చుని ధ‌ర్నా చేశారు. ఆ స‌మ‌యంలో ఆమెను బ‌దిలీ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీనికి వైఎస్ స‌సేమిరా అన‌డంతో మ‌రుస‌టి రెండేళ్ల‌కే ఆయ‌న పార్టీ మారిపోయారు. ఇక‌, వైసీపీలోనూ ప్ర‌స్తుత సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి.. చివ‌ర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇలాంటి ప‌ట్టుబెట్టులు.. రాజ‌కీయాల్లో స‌రిపోవ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. స‌మ‌యం, సంద‌ర్భం.. అవ‌కాశం, అవ‌స‌రం వంటివి మాత్ర‌మే రాజ‌కీయాల్లో ప‌నిచేస్తాయి. ఈ విష‌యంలో రాధాలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంది. కాగా.. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో సుప్త‌చేతనావ‌స్థ‌లో ఉన్న జ‌న‌సేన‌కు రాధా కీక‌ల నాయ‌కుడిగా మార‌నున్నార‌నడంలో సందేహం లేదు.

గ‌తంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాధాన్యం సంపాయించుకున్న జ‌న‌సేన నాయ‌కుడు పోతిన మ‌హేష్‌.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న ద‌రిమిలా.. విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన‌కు నాయ‌కులు క‌రువ‌య్యార‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో వంగ‌వీటి ప‌నితీరు, ఆయ‌న వ్య‌వ‌హ‌రించే విధానం వంటివి ఇప్పుడు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు, జ‌న‌సేన కూడా కీల‌కంగా మార‌నున్నాయి. మ‌రి ఏం చేస్తారు? అనేది చూడాలి.

This post was last modified on October 15, 2026 3:42 pm

Share

Recent Posts

చిరుకు నో హీరోయిన్.. నో రొమాన్స్.. నో డ్యూయెట్

మన స్టార్ హీరోలకు ఎంత వయసు వచ్చినా సరే.. హీరోయిన్లతో రొమాన్సులు.. పాటలు.. డ్యాన్సులు ఉండాల్సిందే అనే అభిప్రాయం ఒకప్పుడు…

1 hour ago

దేశం విడిచి వెళ్లిపో… అమీర్ ఖాన్ మేనల్లుడికి ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు…

1 hour ago

ముత్తువేల్ పాండియన్ మళ్ళీ మొదలెట్టాడా

ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి…

2 hours ago

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

5 hours ago

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…

5 hours ago

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…

7 hours ago