ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ వస్తోందంటే దాని మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మార్నింగ్ ఫస్ట్ షోనే కాదు అసలు మొదటి రోజు టికెట్లు దొరకడమే కష్టమనేలా ఫీవర్ అల్లుకుంటుంది. కానీ జైలర్ 2 ఈ విషయంలో కొంచెం నెమ్మదిగా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తమిళనాడులో జోరుగా ఉన్నా ఏపీ తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్లోగా ఉన్నాయి. అయితే ఇదంతా తుఫాను ముందు ప్రశాంతతగా ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఫీలవుతున్నాయి.
రేపు ఉదయం జైలర్ 2 ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ వీలైనంత పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం. ట్రైలర్ అరాచకం చేస్తుందనుకుంటే జస్ట్ ఓకే అనిపించడం, అనిరుద్ రవిచందర్ పాటలు వైరల్ కాకపోవడం లాంటి కారణాలు హైప్ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం. అయితే సన్ పిక్చర్స్ ధీమా వేరేలా ఉంది. ఇంతకు ముందు లోకేష్ కనగరాజ్ డిసికి ఎలాంటి పబ్లిసిటీ చేయకపోయినా కంటెంట్ తో సూపర్ హిట్ అయ్యిందని, ఇప్పుడూ అదే జరుగుతుందని నమ్ముతోంది కాబోలు.
రజినీకాంత్ మేనియా ఎంత ఉన్నప్పటికీ జైలర్ 2 కు సంబంధించి కొంచెం తక్కువగా అనిపించడానికి కారణం లేకపోలేదు. గత ఏడాది కూలికి ఎలాంటి వాతావరణం ఏర్పడిందో చూశాం. టికెట్ల అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. టాక్ యునానిమస్ రాకపోయినా అయిదు వందల కోట్ల దాకా మేనేజ్ చేసిందని చెన్నై వర్గాలు గట్టిగా ప్రచారం చేశాయి. ఒకవేళ ఆ సినిమా కనక ఖైదీ, విక్రమ్ లాగా మెప్పించి ఉంటె ఈజీగా వెయ్యి కోట్ల మార్కు అందుకునే ఛాన్స్ ఉండేది.
ఇప్పుడు జైలర్ 2 ముందు ఉన్న టార్గెట్ కోలీవుడ్ కలలు కంటున్న థౌజండ్ క్రోర్ మార్కు అందుకుంటుందా లేదానే దాని మీదే ఉంది. అది జరగాలంటే జైలర్ కన్నా జైలర్ 2 చాలా బాగుందనే మాట జనం నుంచి వినిపించాలి. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, సూరజ్, హృతిక్ రోషన్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ ఇలా క్రేజీ సీనియర్ క్యాస్టింగ్ నిండిపోయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బోలెడు కమర్షియల్ ఎలిమెంట్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయట. అవి మెప్పిస్తే చాలు వసూళ్ల వర్షమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates