గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఎప్పుడైతే దురంధర్ ఎలాంటి అంచనాలు లేకుండా వందల కోట్లు కొల్లగొట్టిందో అప్పటి నుంచి అన్ని భాషల స్టార్ హీరోల దృష్టి ఇతని మీద పడింది. రెండో భాగాన్ని ది రివెంజ్ పేరుతో మూడు నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేసి అంతకన్నా గొప్ప విజయం అందుకోవడం ఒక చరిత్ర. ఫ్లాపుల్లో ఉన్న రణ్వీర్ సింగ్ కెరీర్ ని ఒక్కసారిగా పదిమెట్లు ఎక్కించేశారు.
ఇదంతా జరిగి ఆరేడు నెలలవుతున్నా ఆదిత్య ధార్ కొత్త సినిమా ఎవరితో ఉంటుందనే సస్పెన్స్ ఇంకా తొలగడం లేదు. ముందు రణ్వీర్ తోనే మరో కొత్త సిరీస్ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ ఆల్రెడీ ప్రళయ్ లో బిజీ అయిపోయిన రణ్వీర్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేడు. ప్రభాస్ కోసం ఒక స్టోరీ సిద్ధం చేశాడనే ప్రచారం వేసవి సీజన్ లో జరిగింది. అది కూడా ఉత్తుత్తి వార్తే. రామ్ చరణ్ పేరు కూడా వినిపించింది కానీ అందులో వీసమెత్తు నిజం కూడా లేదు.
అసలు ఆదిత్య ధార్ మనసులో ఎవరున్నారనేది అంత ఈజీగా బయట పడేలా లేదు. దురంధర్ కన్నా ముందు అశ్వద్ధామ మీద ఒక భారీ సబ్జెక్టు సిద్ధం చేసుకున్నారు ధార్. విక్కీ కౌశల్ హీరోగా తీద్దామనుకున్నారు. తర్వాత ఎందుకో వర్కౌట్ కాదని భావించి రద్దు చేసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు దాన్ని బయటికి తీస్తారేమోననే అనుమానం ముంబై వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇప్పట్లో దాని జోలికి వెళ్లే ఆలోచనలో ధార్ ఎంత మాత్రం లేడని ఫ్రెండ్స్ అంటున్న మాట.
సరే ఎవరితో చేసినా ఎలాంటి కథతో చేసినా ముందైతే ఆదిత్య దార్ సినిమా మొదలుపెట్టాలనేది అందరి కోరిక స్పై యూనివర్స్ ఫార్ములాని సరికొత్తగా రాసి ఆ జానర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన ఆదిత్య ధార్ నెక్స్ట్ ఎలాంటి బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఒక మహనీయుడు బయోపిక్ ఏదో అనుకున్నారని టాక్ వచ్చింది కానీ అది కూడా నిజం కాదు. రాజమౌళి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడని నార్త్ మీడియా తెగ పొగిడే ఆదిత్య ధార్ తర్వాత అడుగైతే జాగ్రత్తగా పడాల్సిందే.
This post was last modified on October 12, 2026 10:32 pm
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…