Movie News

తరుణ్ భాస్కర్ నుంచి కోరుకునేది ఇదే

కీడా కోలా నుంచి ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నటుడిగా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఇటీవలే విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ తో దర్శకుడిగా మళ్ళీ ట్రాక్ లో పడినట్టే. యాభై కోట్ల వసూళ్లను టచ్ చేయడం చూస్తే యూత్ దీన్ని ఎంతగా రిసీవ్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసినది కావడంతో బిసి సెంటర్స్ లో కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే రిజల్ట్ పరంగా టీమ్ చాలా హ్యాపీగా ఉంది.

తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో అది స్పష్టంగా బయట పడింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ నెక్స్ట్ ఏబీసీ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయబోతున్నానని, ఇకపై డబ్బు వెంట పడతా అని కాసింత ఎమోషనల్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాను, ఏ కులం అనేది చూడకుండా ఏపీ తెలంగాణ ప్రజలు తనను సొంతం చేసుకున్నారని ఇకపై మరింత బాధ్యతగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇదంతా సంతోషపడాల్సిన విషయమే.

నిజానికి పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ ఎక్కడికో వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ దశాబ్ద కాలంలో కేవలం నాలుగు సినిమాలకే పరిమితం కావడం ఆహ్వానించే పరిణామం కాదు. యాక్టర్ గా చేయాలని ఎంత తపన ఉన్నా ఇమేజ్ పరంగా తనకున్న పరిమితులు మార్కెట్ కు అడ్డంకిగా మారాయి. సోలో హీరోగా చేసిన ఓం శాంతి శాంతి శాంతి, గాయపడ్డ సింహం లాంటివి కనీస ఆదరణకు నోచుకోలేకపోవడంతో సీరియస్ విశ్లేషణ చేసుకోవాల్సి వచ్చింది.

సో ఇప్పుడు తరుణ్ భాస్కర్ కనక నిజంగా వేగం పెంచి అన్ని వర్గాలను టార్గెట్ చేసుకుంటే కనక సందీప్ రెడ్డి వంగ తరహాలో మేజిక్ చేయొచ్చు. ఇది కొంత అతిశయోక్తిగా అనిపించినా వాస్తవం. ట్రెండీగా ఆలోచించడం మానేసి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న కథలు రాసుకుంటే తరుణ్ నిజంగానే అన్నంత పని చేయొచ్చు. ఎలాగూ సోషల్ మీడియా సపోర్ట్ పుష్కలంగా ఉంది. అంచనాలకు తగ్గ కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా నెత్తినబెట్టుకుంటారు. కాకపోతే ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు.

This post was last modified on November 24, 2026 10:12 pm

Share

Recent Posts

సెటిల‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న క‌విత‌!

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ ఎస్‌) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. క‌విత…

3 hours ago

చిరంజీవి పేరులో ఆ లెటర్ మిస్సయితే

మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు…

5 hours ago

ఆర్జీవీ ఎప్పటికీ బతికుండే ప్లాన్

రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన…

5 hours ago

ఆ ప్రాజెక్టు ఆపాలని జగన్ కు కేసీఆర్ వార్నింగ్: హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…

5 hours ago

ఒక్కరోజులో 3 లక్షల కోట్ల లాభం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…

6 hours ago

శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…

6 hours ago