గడిచిన మూడు నాలుగు రోజులుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న విమర్శల డోసు పెరిగింది. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత్ లో అనుమతి ఇవ్వకపోవటంపై గుర్రుగా ఉన్న ఆయన.. భారత ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ముకేశ్ అంబానీ అని.. మరో పోస్టులో ఏకంగా భారత ప్రధాని అంబానీ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా బీజేపీకి ఎన్నికల బాండ్లు సమర్పించటమే కాదు.. రిలయన్స్ ద్వారా నిధులు పొందుతున్న ఒక సంస్థ సోషల్ మీడియాలో బీజేపీకి ప్రాచుర్యం కల్పించిందంటూ ఆరోపించారు.
తన వాదనకు బలం చేకూరేందుకు వీలుగా 2022లో అల్ జజీరా ప్రచురించిన ఒక కథనాన్ని.. 2024లోఇండియన్ ఎక్స్ ప్రెస్ పబ్లిష్ చేసిన మరో కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను జత చేశారు. ఈ మీడియా సంస్థ కథనం ప్రకారం క్విక్ సప్లై ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.385 కోట్లు.. శివసేనకు రూ.25 కోట్లు చెల్లించినట్లుగా అందులో పేర్కొన్నారు. మస్క్ ఆరోపించినట్లుగా కేంద్రంలోని మోడీ సర్కారులో కీలకమైన బీజేపీకి భారీ ఎత్తున నిధులు ఇచ్చారనే అనుకుందాం. దాని కారణంగా మస్క్ తో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారానికి అవసరమైన లైసెన్స్ అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆమోదించినా.. ఇప్పటివరకు భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేయకపోవటం గమనార్హం.
మస్క్ అప్లికేషన్ తో పాటు రిలయన్స్.. భారతి ఎయిర్ టెల్ సంస్థలు పెట్టుకున్న మూడు ఆప్లికేషన్లు ఒకే దశలో ఆగి ఉన్నాయి. అలాంటప్పుడు మస్క్ విమర్శల్లో అర్థమేంటి? అన్నది ప్రశ్న. నిబంధనలన్నీ పాటిస్తున్నా భారత్ లోని కొందరు కోటీశ్వరులు కొందరు స్టార్ లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు భారత్ లోకి ఎంట్రీ కాకుండా అడ్డుకుంటున్నారు?అన్న ఆరోపణతో పాటు.. భారతదేశానికి అసలైన బాస్ ముకేశ్ అంబానీ అంటూ మరో పోస్టును సంధించిన ఆయన.. ఇంకో పోస్ట్ లో ఏకంగా భారత ప్రధాని అంబానీ అంటూ పేర్కొన్నారు.
మస్క్ పోస్ట్ లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వెల్ కమ్ టు ఇండియా ఎలాన్.. అంటూ చేసిన పోస్టు వివాదాన్నిమరింత పెంచేలా చేసింది. ప్రధానమంత్రి అంబానీ గారూ.. భారతదేశపు అసలైన యజమాని మీరే అన్నది గుర్తించపోవటంపై వినమ్రంగా క్షమాపణలు కోరుతున్నట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలపై గుత్తాధిపత్య దోపిడీని కొనసాగించాలని మీరు సహజంగానే కోరుకుంటారన్న మస్క్.. పోటీ చేయటానికి స్టార్ లింక్ అనుమతించటాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారా? అంటూ విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై రిలయన్స్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం శాటిలైట్ సేవలకు వివక్షలేకుండా అనుమతులు ఇస్తున్నట్లుగా స్పష్టం చేస్తూ.. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే అనుమతులు లభిస్తున్నాయని పేర్కొనటం తప్పుగా కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఏ రంగంలోనూ ప్రభుత్వం ఏకస్వామ్యాన్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. అంతకంతకూ తన పోస్టుల దాడిని పెంచుతున్న మస్క్ ను మోడీ సర్కారు ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.
This post was last modified on October 13, 2026 11:36 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…